చైనా నుండి వచ్చి ఇక్కడ టాప్ రేంజులో దూసుకుపోవడమే కాదు. ఎంతో మందిని సెలెబ్రెటీలుగా మార్చింది కూడా. అలా చాలా మంది నేను టిక్ టాక్ సెలెబ్రెటీని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆ కోవకు చెందిన వాళ్ళ విషయానికొస్తే టిక్ టాక్ బాలు.. అదేనండి.. ఉప్పల్ బాలు లాంటి వారు  ఈ టిక్ టాక్ వల్ల, వారి జోరును కొనసాగిస్తున్నారు. అలా టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చిన అమ్మాయినే సోనికా కేతావత్. ఈ బ్యూటీ వైజాగ్ వాసి అయితే, చదువుతుంది మాత్రం బిటెక్ అయినా కూడా సోషల్ మాధ్యమాల్లో ఫాలోవెర్స్ మాత్రం లక్ష్యల్లో ఉంటారు. అంతగా ఫెమస్ అయింది. ప్రస్తుతం పరిచయం అక్కర్లేని టిక్ టాక్ సెలెబ్రెటీగా దూసుకు పోతుంది. 

తాజాగా ఈమె మన కళ్ళ ముందు లేదు. రీసెంటుగా ఈమె రోడ్ ప్రమాదంలో ప్రాణాలను విడిచారు. అందరిని షాక్ కి గురిచేసింది. బైక్ రైడింగ్ అంటే ఇష్టమైన ఈమె తిరిగిరాని లోకాలకు వెళ్ళింది. వివరాల్లోకి వెళితే.. తన స్నేహితులతో కలిసి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బైక్ రైడింగ్ చేస్తూ వీడియో తీస్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

నల్గొండ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం తో ప్రాణానికే ముప్పు అనే నినాదాన్ని మరిచిన వీళ్ళు అతివేగంగా బైక్ రైడ్ చేస్తున్న ఈమెకు ఎదురుగా వచ్చిన సైకిల్ ను తప్పించబోయి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొనింది. అయితే, దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచింది. 

ప్రమాదానికి గురైన ఈమెకు మొదట్లో కేవలం చిన్న గాయాలులే తగ్గిపోతాయని అందరు అనుకున్నారు. కానీ, ఆ గాయాల వల్ల ఆమె పరిస్థితి విషమంగా మారింది. దానితో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ ప్రమాదంలో ఆమెతో పాటుగా తన స్నేహితుడికి కూడా గాయాలు కావడం తో అయన చికిత్స పొందుతున్నారు. టిక్ టాక్ అంటే పిచ్చి ఉండాలి. కానీ, చావును కొని తెచ్చుకొనేలా ఉండకూడదు. అతివేగం అత్యంత ప్రమాదకరం సుమీ.. నెమ్మదిగా వెళ్ళండి మీ గమ్యానికి సురక్షితంగా చేరుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: