టీడీపీకి తూర్పుగోదావ‌రి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీ జెండా పీకేసీ వైసీపీ జెండాను ఎత్తుకోనున్నారా.. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం వైసీపీని అనేక‌సార్లు ఇరుకున పెట్టిన తోట త్రిమూర్తులు ఇప్పుడు అదే పార్టీ పంచ‌న చేర‌డానికి మూహూర్తం ఖారారు అయిందా... వాస్త‌వానికి తోట త్రిమూర్తులు ఇప్పుడు పార్టీ మార‌డానికి ఎవ‌రికి అవ‌స‌రం ఉంది.. వైసీపీకా.. తోట త్రిమూర్తులు కా.. అనేది చూస్తే అధికారం లేక‌పోవ‌డంతో పార్టీ మార‌డం అవ‌సరం క‌నుక అది తోట త్రిమూర్తులు అత్య‌వ‌స‌రం... అదే సంద‌ర్భంలో వైసీపీకి తూర్పు గోదావ‌రి జిల్లాలో బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకోవాలంటే అందుకు ప్ర‌ధాన నేత‌గా ఉన్న తోట త్రిమూర్తులు అవ‌స‌రం కూడా ఉంది.


అయితే తోట త్రిమూర్తుల వైసీపీలో చేరికకు సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. తోట త్రిమూర్తులు ఇటీవ‌ల సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని క‌లిసి మంత‌నాలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం.    ఉన్న‌ఫ‌ళంగా పార్టీలో చేరాల‌ని జ‌గ‌న్ కోర‌డంతో కాదు కొంత స‌మ‌యం కావాల‌ని తోట త్రిమూర్తులు స‌మ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. త‌న నియోజ‌క‌వ‌ర్గమైన రామ‌చంద్రాపురంలో కార్య‌కర్త‌లో మాట్లాడి భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లతో పార్టీలో చేరుతార‌ట‌.. అందుకే కొంత స‌మ‌యం తీసుకుంటున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే వైసీపీలో చేరేందుకు తోట త్రిమూర్తులు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిసిందే.


తోట త్రిమూర్తులు రాక‌తో రామ‌చంద్రాపురంలోని వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. తోట త్రిమూర్తులు పార్టీలో చేరితే ఎక్క‌డ త‌మ‌ ఉనికి దెబ్బ ప‌డుతుందో అనే అందోళ‌న‌లో వైసీపీ శ్రేణులు ఉన్నాయ‌ట‌. ఇదిలా ఉంటే సీఎం జ‌గ‌న్ తోట త్రిమూర్తులు కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగాను, మంత్రిగాను రెండు బాధ్య‌తలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు బ‌రువు త‌గ్గించే క్ర‌మంలోనే జ‌గ‌న్ తోట‌కు తూర్పు గోదావ‌రి జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: