Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 6:36 am IST

Menu &Sections

Search

చంద్రబాబు ప‌రువు కృష్ణార్ఫ‌ణం..!

చంద్రబాబు ప‌రువు కృష్ణార్ఫ‌ణం..!
చంద్రబాబు ప‌రువు కృష్ణార్ఫ‌ణం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ముచ్చ‌ట‌గా మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం.. మూడు సార్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌నిచేసిన రాజ‌కీయ నేత‌గా రికార్డు.. అదే సంద‌ర్భంలో అక్ర‌మ మార్గంలో అధికారం చేప‌ట్టిన అప‌వాదు త‌న‌పేరుమీదే ఉన్న రికార్డు.. ఇన్ని రికార్డులు, ఎంతో రాజకీయ ట్రాక్ రికార్డులు ఉన్న టీడీపీ ఆధినేత చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఆయ‌నకు ఉన్న ప‌రువు కాస్తా కృష్ణార్ప‌ణం అయింది అనే టాక్ ఇప్పుడు రాజ‌కీయ స‌ర్కిల్స్‌లో వినిపిస్తుంది. ఎందుకు చంద్రబాబు త‌న ప‌రువును కృష్ణా న‌దిలో క‌లుపుకుంటున్నారో అంటే..


ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు కొడుకు వ‌య‌స్సు. త‌న కొడుకంత‌టి వ‌య‌స్సున్న వ్య‌క్తితో రాజ‌కీయంగా పోటీకి దిగి దిగ‌జారుడు విమ‌ర్శ‌లు చేసి ఘోర ప‌రాజ‌యం పొందిన‌పుడే చంద్రబాబు ప‌రువు బ‌జారున ప‌డ్డ‌ది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌మాణం స్వీకారం చేస్తే తాను ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉండ‌టం ఆయ‌న చేసిన మ‌రో ఘోర త‌ప్పిదం. ఇక స్పీక‌ర్ ఎన్నిక రోజున చంద్ర‌బాబు చేసిన నిర్వాకంతో ఆయ‌న పెద్ద‌రికం గంగ‌పాలైంది. త‌రువాత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఇప్పుడు ఆయ‌న ప‌త‌నాన్ని చూపెడుతున్నాయి..


చంద్రబాబు అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న బినామీల‌కు ప‌ద‌వుల పందేరం వేయ‌డంతో వారి ఆగ‌డాల‌కు అంతే లేకుండా పోయింది. అధికారం ఉంది క‌దా అని విచ్చ‌ల‌విడిగా అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారు. అనేక దుర్మార్గ‌మైన దుశ్చ‌ర్య‌ల‌కు దిగారు. దాడులు, దౌర్జ‌న్యాలు, హ‌త్య‌లు, లూటీలు చేశారు. అయినా చంద్ర‌బాబు వారిని ఏనాడు మంద‌లించిన పాపాన పోలేదు. దీంతో టీడీపీ పుట్టిమునిగింది.. ఎన్నిక‌ల్లో నిండా మునిగింది. ఇప్పుడు అధికారం కొల్పోవ‌డంతో అస‌హానానికి గురైన చంద్ర‌బాబు కుటిల రాజ‌కీయాల‌కు తెర‌లేపాడు. అందులో భాగంగానే త‌న అక్ర‌మాలు, టీడీపీ నేత‌ల అక్ర‌మాలు బ‌య‌ట‌కు రాకుండా ఏమి చేయాలో.. ఏమీ చేయ‌కూడ‌దో అన్ని ప‌నులు చేస్తున్నారు.


అందుకే రాజ‌ధాని భూముల పేరుతో టీడీపీ నేత‌లు సాగించిన అక్ర‌మాలు బ‌య‌టికి వ‌స్తాయ‌నే భ‌యంతో వైసీపీ ఎక్క‌డ రాజ‌ధానిని మార్చుతారోన‌ని గ‌గ్గోలు పెడుతున్నాడు. రాజ‌ధాని విష‌యాన్ని బీజేపీలోని త‌న బినామిల‌తో రాద్దాంతం చేయిస్తున్నాడు. ఇక రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం మెడ‌కు చుట్టుకోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న చంద్ర‌బాబు అడ్డ‌గోలు ఆందోళ‌న‌తో ప‌రువు బ‌జారున ప‌డేసుకున్నాడు. చంద్రబాబు వ్య‌వ‌హారం చూస్తే అక్ర‌మాలు రాజ‌ధానిలో జ‌రిగాయ‌నే అనుమానాలు స‌గ‌టు జ‌నాల‌కు క‌లుగుతున్నాయి. ఇక తాను ఐదేండ్లు అధికారం అనుభ‌వించి కూడా సొంతంగా ఏపీలో ఇల్లు క‌ట్టుకొని ఉండ‌లేని స్థితికి దిగ‌జారిన చంద్రబాబు, ఏకంగా కృష్ణ క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మంగా వెలిసిన ఇంట్లో ఐదేండ్లు కాపురం చేసి విమ‌ర్శ‌ల పాల‌య్యాడు.


ఇక టీడీపీ నేత‌లు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కుటుంబం సాగించిన అక్ర‌మాలు, దౌర్జ‌న్యాలు అంతా ఇంతా కావు. అదే విధంగా చూసుకుంటే య‌ర‌ప‌తినేని అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారం, మాజీ మంత్రులు నారాయ‌ణ‌, గంటా శ్రీ‌నివాస‌రావు, మాజీ ఎంపి ముర‌ళీమోహ‌న్ వంటి వారి అక్ర‌మాలు బ‌య‌ట‌కు రాకుండా చంద్రబాబు ఇప్పుడు అత్మ‌కూరు డ్రామా ఆడుతున్నాడ‌ని అంద‌రు అనుమాన ప‌డుతున్నారు. టీడీపీ నేత‌ల అక్ర‌మాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఎక్క‌డ వెలికితీస్తుందో అనే భ‌యంతోనే గ‌తంలో పోరాటాల పేరుతో చేస్తున్న కుటిల డ్రామాల‌కు పెట్టింది పేరు చంద్రబాబు. చంద్రబాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక్క‌రిపైనా కూడా దాడులు చేయ‌న‌ట్టుగా ఓ ఫోజు కొడుతున్నాడు.


వాస్త‌వానికి ఆత్మ‌కూరు, ప‌ల్నాడు ప్రాంతంలో దాడులు దౌర్జ‌న్యాలు అనేవి కేవ‌లం జ‌గ‌న్ సీఎం అయినాక అవుతున్న‌వి కావ‌న్న స‌త్యం బాబుకు తెలుసు. అక్క‌డ ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో కూడా దాడులు జ‌రిగిన‌ట్లు రుజువులు ఉన్నాయ‌ని తెలుస్తుంది. మ‌రి చంద్రబాబు ఈ విష‌యాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నాడంటే పోల‌వ‌రం, అమ‌రావ‌తి, టీడీపీ నేత‌ల అక్ర‌మాలు బ‌య‌టికి రాకుండా ఇలా చేస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అందుకే అంటారు.. తాను చేస్తే సంసారం మ‌రోక‌రు చేస్తే వ్య‌భిచారం అన్న‌ట్లుగా ఉంది చంద్రాలు  వ్య‌వ‌హారం. what happened to chandrababu naidu dignity
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ మాఫియాకు గుంటూరు వైసీపీ ఎమ్మెల్యే స‌పోర్ట్‌..!
మ‌హారాష్ట్ర‌లో కుదిరిన పొత్తు... సీట్ల డీల్ ఇదే
ఆ తెలంగాణ ఫైర్‌బ్రాండ్ చూపు క‌మ‌లం వైపు..?
కోడెల మరణంతోనైనా... ఆ నేతలకు జ్ఞానోదయం అవుతుందా..!
టీడీపీ త‌మ్ముళ్ల‌ రీచార్జ్ ... ఈ ఉత్సాహం వెన‌క రీజ‌న్ ఇదే..!
మంత్రిగా పేర్ని నానికి ఎన్ని మార్కులు... స‌క్సెస్ అయిన‌ట్టేనా..!
న‌ల్ల‌మ‌ల‌పై తెలంగాణ అసెంబ్లీలో అదిరే ట్విస్ట్‌...
' కోడెల ' మ‌రణంపైనా రాజ‌కీయాలేనా బాబూ.... ఇదేం పద్ధ‌తో మ‌రి..!
తెలుగు రాజ‌కీయాల‌పై కోడెల మార్క్ ముద్ర‌... టీడీపీలోకి ఎలా వెళ్లారంటే...
సొంతపార్టీనే ఛీ కొట్టడాన్ని కోడెల జీర్ణించుకోలేక పోయారా...?
ఒక‌డు పోయాడు.... నేడు కూడా చావ‌నా.... కోడెల‌కు కుమారుడి బెదిరింపులు
కోడెల‌కు త‌ప్ప‌ని బాబు యూజ్ & త్రో పోటు.. బాబు చేతిలో అవ‌మానాలు..
కోడెల ఇంట్లో నిన్న రాత్రి ఏం జ‌రిగింది.. కొడుకుతో గొడ‌వ వెన‌క‌
బాబుతో కోడెల బంధం.. టీడీపీ హిస్ట‌రీలో ఓ చాప్ట‌ర్‌
కోడెల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం (1982 - 2019 )
గోదావ‌రి ప్ర‌మాదం: లాంచీ జాడ దొరికింది... ఎక్క‌డ ఉందంటే...
పాక్ ముక్క‌లు కాక త‌ప్ప‌దా...!
క‌చ్చ‌లూరు ప్ర‌మాదాలకు డేంజ‌ర్ జోన్‌... రీజ‌న్ ఇదే..
వైసీపీలో జూనియ‌ర్ మంత్రి వర్సెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే
వైసీపీలో కొత్త పంచాయితీ... జ‌గ‌న్ తీర్పు ఏంటో..!
బీజేపీ ట్రాప్‌లో ఇద్ద‌రు వైసీపీ ఎంపీలు.. వీళ్లేనా..!
అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఇంటిలిజెన్స్ గుబులు..!
ఏపీకి రెండో రాజ‌ధానిపై జ‌గ‌న్ న‌జ‌ర్...!
ఆ టీడీపీ నేత‌లు చంద్ర‌బాబును వ‌దిలేశారా...!
నీటి మంత్రి అనిల్ నిప్పు..!
కేసీఆర్‌తో గోక్కుని మునిగిన చంద్రబాబు... టీడీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
ఆప‌రేష‌న్ ఆమంచి స్టార్ట్ ... టార్గెట్ ఎవ‌రంటే
జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పి... ఆ పంచాయితీ ఎలా తీరుస్తాడో..!
ప‌వ‌న్‌పై రోజా రివ‌ర్స్ ఎటాక్‌... పంచ్‌లే పంచ్‌లు
బాబు యూజ్ & త్రో దెబ్బ‌కు బ‌లైపోయారుగా...
' గ్యాంగ్ లీడ‌ర్ ' 2 డేస్ క‌లెక్ష‌న్స్‌
అభిన‌వ సూసైడ్ ఫ్యాక్ట‌రీలుగా త‌యార‌వుతోన్న విద్యాల‌యాల త‌ప్పులు..?
కంచుకోటలో టీడీపీ ప‌ని ఖేల్ ఖ‌త‌మేనా..!
ఏపీ బీజేపీలో బాబు కోవర్టులు వీళ్ళేనా..!
ఆ వైసీపీ నేత అంటే..బొత్సకు అంత భయమా..?
క‌ష్ట‌మైనా... న‌ష్ట‌మైనా మాట నిల‌బెట్టుకున్న జ‌గ‌న్‌
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.