చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మీడియా ముందు చెప్పిందే చెప్పి నాన్చుతున్నాడు. మరీ చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు రాలేదేమో .. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ ను పోలీసులు ఎలా బలవంతంగా వెనక్కి పంపించారో మనం చూశాము. దానితో పోలిస్తే చంద్రబాబు హౌస్ అరెస్ట్ పెద్ద విషయం కాదని చెప్పాలి. చంద్రబాబు ప్రతి పక్షంలోకి రాగానే ఇటువంటి డ్రామాలు ఆడటం కొత్తేమి కాదు. ప్రజల్లో పార్టీ గురించి .. మీడియాలో చర్చల కోసమైన బాబు గారు ఇటువంటి పబ్లిసిటీ స్టంట్లు చేయడం అలవాటు. చంద్రబాబుకు కొన్ని రోజుల నుంచి టీడీపీ పైడ్ ఆర్టిస్టులతో నానా హంగామా చేస్తున్నారు.


రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలానే .. టీడీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగిపోతున్నాయని పబ్లిసిటీ రాజకీయాలు చేశారు. కానీ అప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే మళ్ళీ షురూ చేశారు. కామెడీ ఏంటంటే ఇప్పుడు కూడా జనాలు పెద్దగా సీరియస్ గా తీసుకోవటం లేదు. కానీ బాబు మాత్రం .. పొలిటిల్ మైలేజ్ కోసం తెగ పాకులాడుతున్నారు.


చంద్రబాబు నాకు 40 ఏళ్ల అనుభవం ఉందని ఎప్పటి నుంచో డప్పు కొట్టుకున్నాడు. మొన్న ఎన్నికలో మాకు మీ అనుభవం వద్దని సైకిల్ చక్రాలు విరగొట్టారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజల్లో నమ్మకం ఎప్పుడో పోయింది. ఇప్పుడు చలో ఆత్మకూరు పేరిట బాబు చేస్తున్న డ్రామాలు ప్రజలకు చిరాకు పుట్టిస్తున్నాయి. 100 రోజులు జగన్ తన పాలనను పూర్తి చేసుకున్నారు. అదే మాదిరిగా 100 రోజులు చంద్రబాబు ప్రతి పక్షంలో  పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజులు జగన్ ..చంద్రబాబుకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేసి ఇంకా దిగజారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: