రాజకీయాల్లో రకరకాల నేతలు ఉంటారు. ఒక్కో నేత తీరు ఒక్కోలా ఉంటుంది. సహజంగా ఎవరైనా నేత ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీని తిడితే సస్పెండ్ చేస్తారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే గా ఉన్న‌ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుంది ఆ పార్టీ అక్కడ బలపడుతుందని చెబుతున్నా ఆయనను కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని.... పార్టీ జాతీయ నాయకత్వాన్ని తిడుతూ బీజేపీని పొగుడుతూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో ఒంటరై పోయారు.


ఇటు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలవకుండా... అటు తాను వెళ్లాలి అనుకుంటున్నా బిజెపి ఎమ్మెల్యేతో కలవకుండా ఒంటరిగా కూర్చోవటం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ ఒంటరివాడు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీని తిడుతున్నా పార్టీ అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవ‌డం లేదు. తీసుకోవ‌డం లేదు అనేకంటే తీసుకునే స్థితిలో లేదు.


బీజేపీపై ప్రేమ ఒలకబోస్తున్న ఈయన కాంగ్రెస్ ను వీడి కమలం పార్టీలో చేరడం లేదు. ఇలా కక్కలేక మింగలేక రాజగోపాల్ అసెంబ్లీలో ఒంటరైపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణ రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ది ఎప్పుడూ ఒకే మాట‌.. ఓకే బాణం అన్న చందంగా ఉండేది. అయితే ఇప్పుడు అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భువ‌న‌గిరి ఎంపీగా ఉన్నారు. అన్న ఎంపీగా గెలవడంతో ఇప్పుడు అన్నను విడిచి బీజేపీలో చేరలేని పరిస్థితి రాజగోపాల్ కు వచ్చింది. అలా అని కునారిల్లుతున్న కాంగ్రెస్ లో కొనసాగలేని పరిస్థితిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: