ఇప్పుడు రాజ‌కీయాల్లో ఏ ఎండకు ఆ గొడుగు ప‌ట్ట‌డం కొంద‌రు నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. ప‌ద‌వులే ప‌ర‌మ‌వాదిగా, సంపాద‌నే ధ్యేయంగా, కాంట్రాక్టులే కొల‌మానంగా రాజ‌కీయాలు న‌డుపుతున్నారు కొంద‌రు రాజకీయ నేతులు. ఇంకా కొంద‌రు రాజ‌కీయాన్ని కేవ‌లం వ్యాపారాల‌కు అండ‌గా ఉండేందుకు, త‌మ ఆస్తులు కాపాడుకునే ఓ వేదిక‌లుగా వాడుకుంటూ ప‌బ్బం గ‌డుపుకుంటున్న నేత‌లు కోకొల్ల‌లు. అయితే ఇప్పుడు అలాంటి నేత‌లు అన్ని పార్టీలో లెక్క‌కు మిక్కిలిగా ఉన్నారు. వీరితో పార్టీల‌కు ఒరిగేది ఏమి ఉండ‌క‌పోగా, కేవ‌లం ఎన్నిక‌ల‌ప్పుడు పార్టీకి పండ్‌ను స‌మ‌కూర్చే నేత‌లుగానే మిగిలిపోతున్నారు.


అందుకే కొంద‌రు కేవ‌లం రాజ‌కీయాల‌ను త‌న అవ‌స‌రాల కోసం వాడుకుంటూ, కేవ‌లం త‌మ వ్యాపారాల‌ను పెంచుకుంటూ, కాంట్రాక్టులు పొందుతూ కోట్లాది రూపాయ‌లు పోగేసుకుంటున్నారు.. అందులో ఇప్పుడు అధికార వైసీపీ పార్టీలో ఓ ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల వ్య‌వ‌హ‌రశైలీ కూడా దీనికి నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల వ్య‌వ‌హారంతో సీఎం జ‌గ‌న్‌కు ఒరింగిందేమ‌న్నా ఉందా.. లేక వారితో త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదా.. అంటే వారితో ఒరింగిందేమి లేద‌ని, జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేద‌ని పార్టీ శ్రేణులు అంటున్నాయి.. ఇంత‌కు సీఎం జ‌గ‌న్‌కే త‌ల‌నొప్పిగా మారిన ఈ ప్ర‌జా ప్ర‌తినిధులెవ‌రు అనే సందేహం కలుగుతుంది క‌దూ.. అయితే ఓసారి చూడండి..


1990 నాటి రాజ‌కీయాల్లో ఉన్న నైతిక విలువ‌లకు ఇప్పుడున్న నాయ‌క‌త్వాలు తిలోద‌కాలు ఇచ్చేసారు.. అలా నైతిక విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చిన ఈ ఇద్ద‌రు ఎంపీలు సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారార‌ట‌. వారు ఎవ‌రో కాదు.. వీరికి జంపింగ్‌లు చేయ‌డంలో సిద్ద‌హ‌స్తులు కావ‌డం విశేషం.. ఇందులో ఒక‌రు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి. ఇత‌గాడు రాష్ట్రం విడిపోక ముందు కాంగ్రెస్ నేత‌. ఆయ‌న రాష్ట్రం విడిపోగానే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. అక్క‌డ అనేక ప‌ద‌వులు అనుభ‌వించారు.. స‌రిక‌దా కాంట్రాక్టులు పొంది, త‌న వ్యాపారాల‌ను మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా విస్త‌రించి అందిన కాడికి దోచుకుతిన్నారు.. టీడీపీలో ఉన్న‌ప్పుడు గ‌డ్డి క‌రించేందుకు వెనుకాడ‌ని మాగుంట 2019 ఎన్నిక‌లు రాగానే ఓట‌మి భ‌యంతో వెంట‌నే వైసీపీ గూటికి చేరిపోయారు.


వైసీపీలో ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వ‌డం, ఫ్యాన్ గాలికి గెల‌వ‌డం జ‌రిగింది. ఇక పాత వాస‌న పోని ఈ ఎంపీతో పార్టీకి గానీ, కార్య‌క‌ర్త‌లకు గాని ఒరింగిందేమ‌న్నా ఉందా అంటే స్వ‌ప్ర‌యోజ‌నాలు త‌ప్పితే కార్య‌క‌ర్త‌ల క‌ష్ట‌సుఖాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక మ‌రోకరు నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి. ఈ ఎంపీకి జంపింగ్‌లో ఆరితేరిన వ‌స్తాద్‌.. గోడ‌లు దూక‌డంతో ఆదాల ను మించిన వారు ఎవ‌రు లేరంటే అతిశ‌యోక్తి కాదు. టీడీపీకి చెందిన ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి త‌రువాత మ‌ళ్ళీ టీడీపీ పంచ‌న చేరి ప్ర‌జాప్ర‌తినిధిగా గెలిచి, కాంట్రాక్టులు పొంది అనేక లాభాలు గ‌డించిన ఆదాల.. టీడీపీకి చెడ్డ రోజులు వ‌చ్చాయ‌ని గ్ర‌హించి టీడీపీలో టికెట్ ద‌క్కించుకోని కూడా దొడ్డిదారిని వైసీపీలో చేరిపోయారు.. వెంట‌నే నెల్లూరు ఎంపీ టికెట్ పొంద‌డం జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలో గెల‌వ‌డం జ‌రిగింది.


ఇలా గెలిచిన ఇత‌గాడు కూడా పార్టీ కి గాని, కార్య‌క‌ర్త‌ల‌కు గాని ఏమైనా ఉప‌యోగ‌ప‌డ్డాడా అంటే అదేమి లేదు.. ఇలా ఇద్ద‌రు ఎంపీలు అప్ప‌నంగా జ‌గ‌న్ సృష్టించిన ప్ర‌భంజ‌నంలో గెలిచి త‌న అవ‌స‌రాలే ప్ర‌ధానంగా ముందుకు పోతున్నారు.. కాకుంటే కార్య‌క‌ర్త‌ల కోసం, పార్టీ కోసం ఎలాంటి ప‌నిచేయ‌కుండా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లుగా ఉంటున్నారు.. సో ఈ ఇద్ద‌రు ఎంపీలు ఏనాడైనా జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోతే మ‌రోపార్టీలోకి త‌మ‌కు అలవాటైన జంపింగ్ జపాంగ్‌గా మారడం ఖాయం..



మరింత సమాచారం తెలుసుకోండి: