తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా ఏర్పాటు అయిన పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి. ఇది కేవ‌లం ఉద్య‌మ పార్టీగా అవిర్భ‌వించిన పార్టీ. తెలంగాణ వాదులంద‌రికి ఓ వేదిక ఉండాల‌నే ఆలోచ‌న‌తో అనేక‌మంది ఉద్య‌మకారుల త్యాగాల‌తో పురుడుపోసుకున్నది టీ ఆర్ ఎస్ పార్టీ. పార్టీ ఆవిర్భావంలో ప‌నిచేసిన ఉద్య‌మకారుల‌ను తన‌దైన శైలీలో ఉద్య‌మ‌ద్రోహులుగా మార్చి టీ ఆర్ ఎస్ ఉద్య‌మ పార్టీని హ‌స్తగ‌తం చేసుకున్నాడు ప్ర‌స్తుత సీఎం కేసీఆర్‌. అయితే ఎంద‌రో ఉద్య‌మకారుల త్యాగాల పునాదుల‌పై నిర్మిత‌మైన టీ ఆర్ ఎస్ పార్టీ త‌రువాత కేసీఆర్ చేజిక్కుంచుకుని ఉద్య‌మపార్టీని ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మార్చాడు.. నాది ఫక్తు రాజ‌కీయ పార్టీ అని కేసీఆర్ ప్ర‌క‌టించాడు.


అయితే ఇప్పుడు టీ ఆర్ ఎస్ పార్టీని స్థాపించి, రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా ప‌నిచేసిన ఉద్య‌మకారులు అనేక మంది అవ‌మానక‌ర‌మైన రీతిలో పార్టీ నుంచి ఉద్వాస‌న‌కు గురైన సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లుగా జ‌రిగాయి. రాను రాను టీ ఆర్ ఎస్ పార్టీ ఉద్య‌మ నాయ‌కుల చేతుల్లోంచి కేవ‌లం కేసీఆర్ కుటుంబ పార్టీగా మారిపోయింది. అయితే ఇటీవ‌ల టీ ఆర్ ఎస్ పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే కేసీఆర్ పై అనేక మంది గులాబి జెండా ఓన‌ర్లు ధిక్కార‌స్వ‌రం వినిపిస్తున్నారు. గులాబి పార్టీకి ఓన‌ర్లం.. మేం అడుక్కునే వాళ్ళం కాదు.. అంటూ తెలంగాణ రాష్ట్ర వైధ్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ హుంక‌రించాడు.


అయితే ధిక్కార స్వ‌రం వినిపించిన వారిలో ఈటెల రాజేంద‌ర్ మొద‌టి వ్య‌క్తేం కాదు.. ఇంత‌కు ముందే టైగ‌ర్ న‌రేంద్ర‌, న‌టి విజ‌య‌శాంతి, మాజీ ఎంపీ ర‌వీంద్ర‌నాయ‌క్‌, తూర్పు జ‌య‌ప్ర‌కాశ్‌రెడ్డి, దుగ్యాల శ్రీ‌నివాస‌రావు లాంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. కేసీఆర్‌కు నిద్ర‌లేని రాత్రుల‌ను మిగిల్చారు. అయితే ఇప్పుడు గులాబీ జెండా ఓన‌ర్లే కాదు.. కిరాయిదార్లు కూడా కేసీఆర్‌పై వేరు కుంపటి పెట్టెందుకు సిద్ద‌మ‌య్యారు.. అందుకు వేదిక‌ను ఖ‌రారు చేసుకుంటున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.. ఉద్య‌మ కాలం నుంచి గులాబి జెండాను మోసిన నేత‌లు ధిక్కార‌స్వ‌రం వినిపించారంటే అది అంద‌రికి స‌మ్మ‌త‌మే.. కాని ఉద్య‌మానికి సంబంధం లేకుండా పార్టీలో చేరిన కిరాయిదార్ల ప‌రిస్థితి ఏంటి.. వారు ఇప్పుడు కొత్త కుంప‌టి పెట్టుకోవ‌డం విడ్డూరంగా ఉంది క‌దూ.. కాని అది నిజ‌మేన‌ట‌.


తెలంగాణకు వ్య‌తిరేకంగా ప‌నిచేసి, ఉద్య‌మ‌కారులపై దాడులు చేయించిన నేత‌లు టీఆర్ ఎస్‌లోకి కిరాయిదారులుగా చొర‌బ‌డి అధికారం చెలాయిస్తుంటే మ‌రికొంద‌రు కిరాయిదార్ల‌లో అస‌హ‌నం పెరిగిపోయింది.. కిరాయికి వ‌చ్చిన వారు మంత్రులుగా ప‌ద‌వులు వెలగ‌బెడుతున్న‌వారిలో త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, మ‌ల్లారెడ్డి, స‌త్య‌వ‌తిరాథోడ్‌, స‌బితా ఇంద్రారెడ్డి ఇలా చెప్ప‌కుంటూ పోతే స‌గం మంది కిరాయిదార్లే అధికారం చెలాయిస్తున్నారు. ఇప్పుడు వీరంద‌రికి అక్ర‌మ‌ప‌ద్ద‌తుల్లో ప‌ద‌వులు ద‌క్కుతుంటే... మాకేందుకు ఇవ్వ‌రంటూ మ‌రికొంత మంది కిరాయిదార్లు సొంత కుంపటి పెట్టుకుంటున్నారు.


అందుకు నిద‌ర్శ‌నం.. మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, బాజ‌రెడ్డి గోవ‌ర్థ‌న్‌, డాక్ట‌ర్ టి. రాజ‌య్య‌, మాద‌వ‌రం కృష్ణారావు, జూప‌ల్లి కృష్ణారావు లాంటివారు సొంత కుంప‌టి పెట్టుకుని గులాబీ బాస్‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నారు. సో ఇప్ప‌టికి గులాబీ జెండాను కిరాయిదారులు పీకేస్తారా.. అందుకు గులాబీ గూటిలో ఉన్న‌దాంట్లో ఓన‌ర్లు త‌క్కువ కిరాయిదార్లు ఎక్కువ. అందుకే ఇప్పుడు కేసీఆర్‌కు కిరాయిదార్ల తో ఎప్పుడు ఏ ఉప‌ద్ర‌వం ముంచుకొస్తుంద‌నే భ‌యం ప‌ట్టుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: