ప్రధాని నరేంద్ర మోడీ అంటే అపజయం ఎరుగని వీరుడుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేశారు. అక్కడ నుంచి జాతీయ రాజకీయాల్లోకి వస్తూనే ఏకంగా ప్రధాని అయిపోయారు. ఒకటి కాదు రెండు మార్లు ప్రధాని కుర్చీలో ఆయన కూర్చున్నారు. 2024 వరకూ ఆయన పదవీకాలం ఉంది. మోడీ రాజకీయ జీవితంలో చాలా సాధించారు.


దేశంలో ఏ ప్రధాని చేయలేని పనులు కూడా ఎన్నో చేశారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించి ఆయన నెహ్రూను కూడా మించాడని ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ముస్లిం సమాజాన్ని కూడా జాతీయ స్రవంతిలో కలుపుకుంటూ ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు. పాకిస్థాన్ పీచమణిచిన మోడీ ఇక‌ పాక్ నుంచి శాశ్వతంగా ముప్పు లేకుండా చేయాలనుకుంటున్నారు.


అదే విధంగా భవ్యమైన అయోధ్య  రామ మందిరాన్ని కూడా నిర్మించాలని మోడీ కలలు కంటున్నారు. అది కూడా ఆయన హయాంలోనే జరుగుతుందని అంటున్నారు. ఇక  రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పదేళ్ల పాటు మాత్రమే ఉంచిన రిజర్వేషన్లు ఏ సర్కార్ ముట్టుకోవడానికి కనీసంగా కూడా సాహసించడంలేదు. మోడీ మాత్రం దాన్ని కూడా టచ్ చేసి ఆధునిక భారతాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు.


వీటితో పాటు మోడీ ఒకే దేశం, , ఒకేసారి  ఎన్నికలు కూడా నిర్వహించాలని కూడా పరితపిస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే 2024లో ఎన్నికలు వస్తాయి. అప్పటికి మోడీకి 74 ఏళ్ళు వస్తాయి. బీజేపీలో మోడీ పెట్టిన నిబంధన మేరకు 75 ఏళ్ళు దాటిన వారు రాజకీయాల్లో ఉండరాదు. అందువల్ల 2024 ఎన్నికల్లో బీజేపీని మరో మారు గెలిపించి మోడీ రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్ అవుతారని అంటున్నారు. మొత్తం మీద మోడీ  మరో నాలుగైదేళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉంటారని చెబుతున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: