చంద్రబాబు అంటేనే అది అంటారు. ఆయన తరచూ చెబుతూంటారు, సమస్యను సవాల్ గా తీసుకుంటాను, సంక్షోభాన్ని కూడా సంక్షేమంగా మార్చుకుంటాను అని. బాబు వైఖరి చూస్తే అది నిజమేననిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయాక ఆయనలో చాలా మార్పు వచ్చింది. అది జాగ్రత్తగా గమనించేవారికే అర్ధమవుతుంది. 


బాబు ఇదివరకులా ఢిల్లీ టూర్లు చేయడం లేదు, హైదరాబాద్ కూడా వెళ్ళినా మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నారు. ఇక ఆయన పని ఉంటే తప్ప ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు  అసలు పోవడం లేదు, నిరంతరం బాబు అమరావతినే అట్టిపెట్టుకుని ఉంటున్నారు. బాబు మూడు నెలలుగా పోయిన చోటనే వెతుక్కునే పనిలో పడ్డారు. అమరావతి దాటి రానని ఒట్టు పెట్టుకున్నట్లుగా బాబు తీరు ఉందని అంటున్నారు.


తాను కూర్చున్న కుర్చీని జగన్ తీసుకున్నాడని బాబు ఆలోచన. అందువల్ల జగన్ని ఎలాగైనా గద్దె దించాలన్న పంతం, పట్టుదల బాబులో కచ్చితంగా కనిపిస్తోంది. ఎటువంటి అవకాశాన్ని జారవిడుచుకోరాదని బాబు జగన్ మీద యుధ్ధాన్ని ప్రకటించేశారు. ఎక్కడా అలుపు లేకుండా ఆయన వైసీపీ మీద రాజకీయం చేస్తున్నారు. ఒక రోజు కాకపోయినా కొన్ని రోజుల తరువాత అయినా జనం తన దారికి వస్తారని, జగన్ నుంచి మోజు తగ్గాక టీడీపీ వైపే చూస్తారని బాబు నమ్మకం.



ఆయన పార్టీ నాయకులకు కూడా తరచూ చెబుతూంటారు. తాను ఆశావాదినని, ఎక్కడికీ పారిపోనని, ఉన్న చోట నుంచి మళ్ళీ ఎగిసిపడతానని అంటూంటారు. చలో ఆత్మకూరు పేరు మీద తొలి సమరశంఖం పూర్తించిన చంద్రబాబు ఇపుడు మరిన్ని ఆందోళలనకు రెడీ అవుతున్నారు. ఈ విధంగా లోకల్ బాడీ ఎన్నికల వరకూ వేడి రాజేసి అక్కడ మంచి ఫలితాలు కనుక సాధిస్తే జగన్ మీద వీర లెవెల్లో పోరాటానికి బాబు సిద్ధపడిపోతారని అంటున్నారు. మొత్తానికి బాబు 2020  ఏడాది మొదటి నాటికే తెలుగుదేశం పార్టీని  ఫుల్ స్వింగ్ లోకి తేవాలనుకుంటున్నారు. చూడాలి మరి బాబు అమరావతిని దాటి వెళ్ళనని చేసిన శపధానికి ఫలితం ఎంతవరకూ ఉంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: