ఒకప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం అంటే ఆ రెండు దేశాలు నష్టపోయేవి.  కేవలం రెండు దేశాలకు చెందిన సైనికులు మాత్రమే మరణించేవారు.  సామాన్యులకు పెద్దగా ఇబ్బందులు ఉండవు.  ఏ రాజు పాలనలో అయినా వాళ్ళు కష్టపడాల్సిందే.  పన్నులు కట్టాల్సిందే.  ఇప్పుడు రాజులు లేరు.. రాజ్యాలు లేవు.  ఉన్నది ప్రభుత్వాలే.. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత యుద్ధం చేయడం అంటే వినయాన్ని కొని తెచ్చుకోవడమే.  అందుకే ఇప్పటి రోజుల్లో యుద్ధం అంటే భయపడుతున్నారు. 


పైగా ఇప్పుడు చాలా దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి.  వాటిని ప్రయోగిస్తే.. ప్రపంచం ఒక్కసారిగా భగ్గుమంటుంది.  వినాశనం జరుగుతుంది.  భూమిపై పురుగు ఉండదు.  అందుకే యుద్ధం అంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు.  ఆచితూచి అడుగులు వేస్తారు.  ప్రపంచంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల పేరుతో ప్రపంచంలోని 80 కి పైగా దేశాల్లో అమెరికా యుద్ధం చేసింది.  ఇప్పటికి చేస్తూనే ఉన్నది.  ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువ.  


ఇరాక్, సిరియా, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో అమెరికా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నది.  అమెరికా యుద్ధం కోసం దాదాపు 5.9 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.  అంటే మన కరెన్సీలో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది.  ఈ యుద్ధాల కారణంగా ఇరాక్, సిరియా, ఆఫ్ఘన్ వంటి దేశాల్లో దాదాపు 5 లక్షల మంది సామాన్య ప్రజలు మరణించారు.  యుద్ధములో లక్షలాది మంది మగవాళ్ళు మరణించడంతో.. ఆయా కుటుంబాలను పోషించేదిక్కు లేక రోడ్డున పడ్డాయి.  


అంగవైకల్యంతో చిన్నారు బాధపడుతున్నారు.  ఉగ్రవాద నిరోధం పేరుతో అమెరికా ఫైట్ చేస్తున్నది కాబట్టి.. ఒకవేళ యుద్ధం ఆపేసినా..ఆయా దేశాలకు అమెరికా నిధులను ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి.  దీని కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఇప్పటికే దారుణంగా దెబ్బతిన్నది.  నిరుద్యోగం తాండవిస్తోంది.  దీంతో అమెరికాలో అక్రమాలు మొదలయ్యాయి. లూటీలు చేస్తున్నారు.  గన్ కల్చర్ పెరిగింది.  అమెరికా అలోచించి ఈ డబ్బును మంచి పనులకోసం వినియోగించి ఉంటె ఎంతో మందికి దారిచూపించినట్టు అయ్యేది.  యుద్ధం కోసం డబ్బు ఖర్చు చేయడం అంటే.. బూడిలో పోసినట్టే కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: