ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రికెటర్ మన భారత జాతీయ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. గత సంవత్సరం డిసెంబర్ లో విరాట్... బాలీవుడ్ గ్లామర్ డాల్ అనుష్క శర్మ ను వివాహమాడాడు. కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరు చివరికి ఒక్కటయ్యారు. పెళ్లయినప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో తమ ఫోటోలను పెడుతూ హంగామా చేస్తూ ఉన్నారు. వాటిల్లో తాజగా విరాట్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో అయితే కొంచెం శ్రుతి మించినట్లే కనిపించింది.

సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోలో విరాట్ మరియు అనుష్క ఇద్దరూ ఒకరి ఒళ్ళో ఒకరు మిట్టమధ్యాహ్నం బీచ్ లో సేదతీరుతూ కనిపించారు. కోహ్లీ ఆ ఫోటోలో అనుష్క ఒడిలో పడుకొని తన తలను ఆమె ఛాతీ మీద ఉంచి సెల్ఫీ తీసుకున్నాడు. చెప్పడం మర్చిపోయాను ఆమె ఆ సమయంలో బికినీ వేసుకుని ఉంది. ఇదిలా ఉండగా ఈ ఫోటో చూసి నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ట్రోల్స్ వేసేవారు, మీమ్ మేకర్లు అయితే ఇక పండగ చేసుకున్నారు. గత నెలంతా అనుష్క మరియు విరాట్, వెస్టిండీస్ లో భారత జట్టు సిరీస్ ఆడగా అక్కడే ఎంజాయ్ చేసి ఈ వారమే భారతదేశానికి రిటన్ అయ్యారు.

ఇంతకు మునుపే అనుష్క బీచ్ లో దిగిన ఫోటోలను పెట్టగా ట్విట్టర్లో మరియు ఇంస్టాగ్రామ్ లో లో ఆమె పెట్టిన ఫోటో పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఈ ఫోటోలో మాత్రం ఇద్దరూ అర కొర బట్టల్లో ఒకరి ఒళ్ళో ఒకరు పడుకుని ఫోటోలు తీసుకోవడం... పైగా అనుష్క ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టడంతో విమర్శకారులకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. తమ వైవాహిక జీవితాన్ని సెలెబ్ర్రేట్ చేసుకుంటూ వీరు తమ అకౌంట్ లలో ఫోటోలు పెడుతున్నారు కానీ చివరికి తిట్లపాలవుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: