దేశంలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత దేశంలో జరిమానాలు విధింపు ఎక్కువైంది.  జరిమానాలు విధిస్తుండంతో ప్రజలు భయపడుతున్నారు.  ఎక్కడా లేని విధంగా జరిమానాలు విధిస్తున్నారని బాధపడుతున్నారు.  కొత్త వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించడం న్యాయం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నాకు దిగింది.  అయితే చట్టాలను తీసుకొచ్చింది ప్రజల సేఫ్టీ కోసమే అని.. అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు జరిమానాలు ఎందుకు వేస్తారని ప్రభుత్వం ప్రశ్నిస్తుంది.  


డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటివి లేకుండా డ్రైవింగ్ చేయడం వలన ఎన్నో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.  ప్రమాణాలు పాటించకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారు.  మైనర్లు రోడ్డుపైకి వాహనాలను తీసుకొచ్చి యాక్సిడెంట్ చేస్తున్నారు.  ప్రాణాలు కోల్పోతున్నారు.  ఫిట్నెస్ లేకుండా వాహనాలు నడుపుతున్న ఎన్నో స్కూల్స్ చెందిన బస్సులు నిత్యం యాక్సిడెంట్ కు గురవుతున్నాయి.  ఫలితంగా గొప్ప భవిష్యత్తు ఉన్న చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.  


ఆయా బస్సులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటారు.  ఇలాంటి చట్టాలు తీసుకొస్తే వాటిపై ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి అని కేంద్రం ఘాటుగా స్పందించింది.  టూవీలర్ మాత్రమే కాదు ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారని అంటున్నారు.  అయితే, కొత్త చట్టాలను అమలు చేసే అధికారం రాష్ట్రాల్లో ఉందని, ఆయా రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయాలా వద్దా అని సమీక్షించుకుని అమలు చేస్తున్నాయని అన్నారు.  ఇదిలా ఉంటె,  ఇలా వాహన చట్టాలు అమెరికా, రష్యా, బ్రిటన్, సింగపూర్, దుబాయ్  వంటి దేశాల్లో చాలా కఠినంగా ఉంటాయి.  అక్కడి రూల్స్ ను అతిక్రమిస్తే జరిమానాలు దారుణంగా ఉంటాయి.  అందుకే ఆయా దేశాలు అభివృద్ధి చెందాయి.  


 అమెరికా విషయానికి వస్తే.. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే 25డాలర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 1000డాలర్లు, హెల్మెట్ లేకుంటే 300 డాలర్లు చలానా విధిస్తారు.  అదే రష్యా విషయానికి వస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కు 50వేల రూబుల్స్ తో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.  సింగపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 5000 డాలర్లు ఫైన్ వేస్తారు.  వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడితే 1000 డాలర్ల ఫైన్ పడుతుంది.  దుబాయ్ లో అయితే ఫైన్ లు చాలా వింతగా ఉంటాయి. అక్కడి ప్రభుత్వం శుభ్రతకు ప్రాముఖ్యతను ఇస్తుంది.  మురికిగా ఉన్న వాహన కనిపిస్తే మొదట హెచ్చరిస్తారు.  దాంతో పాటు 500 దిర్హామ్ లు ఫైన్ వేస్తారు.  15 రోజుల తరువాత కూడా ఆ వాహనం అంతే మురికిగా కనిపిస్తే దాన్ని డంపింగ్ యార్డ్ కు పంపిస్తారట.  ఇలా ఎన్నో కఠినమైన రూల్స్ ను అక్కడ పెట్టడం వలనే ఆయా దేశాల్లోని ప్రజలు చట్టాలను గౌరవిస్తూ సక్రమంగా నడుచుకుంటున్నారు.  మనదగ్గర రూల్స్ ను పాటించేవారికంటే వాటిని బ్రేక్ చేసేవాళ్ళే అధికం.  


మరింత సమాచారం తెలుసుకోండి: