కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అనే సామెత ఒకటుంది తెలుగులో.  ఆ సామెత ఇపుడు చంద్రబాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది. టిడిపి పై వైసిపి దాడులని హత్యా రాజకీయాలంటూ పది రోజుల పాటు నానా హడావుడి చేశారు. ఇంత హడావుడి చేసినా చివరకు షో మొత్తం ఫ్లాప్ అయ్యింది. చంద్రబాబు అనుకున్నట్లుగా ఎల్లోమీడియాలోను జాతీయ మీడియాలోను టిడిపికి అనుకూలంగా ప్రచారం అయితే వచ్చింది కానీ స్దానికులు మాత్రం చంద్రబాబుపై మండిపోతున్నారు.

 

విచిత్రమేమిటంటే ఆత్మకూరు విలేజిలో రెండు ఎస్సీ కుటుంబాల మధ్య గొడవగా తేలిపోయింది. అదికూడా మామా అల్లుళ్ళు వాళ్ళ కుటుంబాల మధ్య రేగిన గొడవ మాత్రమే. ఒకపుడు మామా, అల్లుళ్ళ కుటుంబాలు రెండూ టిడిపిలోనే ఉండేవారు. కానీ ఈమధ్యనే రెండు కుటుంబాల్లో కొందరు వైసిపిలో చేరారు. దాంతో కుటుంబాల మధ్య వివాదం కాస్త రెండు పార్టీల మధ్య గొడవగా మారిపోయింది.

 

ఎప్పుడైతే రెండు కుటుంబాలు, రెండు పార్టీలు ఉన్నాయంటే గొడవలు సహజమే కదా ? ఇక్కడ కూడా జరిగిందదే. ఎన్నికలకు ముందే రెండుగా విడిపోయిన కుటుంబాల్లో ఆధిపత్య గొడవలు మొదలయ్యాయి. దాంతో ఒకళ్ళపై మరొకరు దాడులు చేసుకోవటం, కేసులు పెట్టుకోవటం మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి దారుణ ఓటమి తర్వాత వైసిపిలోని వాళ్ళు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. దాంతో ఆ రెండు కుటుంబాలకు చెందిన బంధువులు కూడా రెండుగా విడిపోయారు.

 

ఇపుడు జరిగిన గొడవలు కూడా ఆ రెండు కుటుంబాలు, వాళ్ళ బంధువల మధ్య జరిగిందే. అంటే కేవలం రెండు కుటుంబాలు, బంధువల మధ్య జరిగిన గొడవలనే చంద్రబాబు మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలని ప్రయత్నించారు.  విచిత్రమేమిటంటే చంద్రబాబు ప్రయత్నాలను ఆత్మకూరు విలేజ్ లో స్ధానికులెవరూ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా పూర్తిగా వ్యతిరేకించారు.  అంటే ఓ చిన్న సమస్యను పట్టుకుని చంద్రబాబు నానా యాగీ చేశారన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందుకే టిడిపి నేతలే చాలామంది చంద్రబాబు పిలుపుకి స్పందించలేదు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: