ఆగస్టు 5 వ తేదీ తరువాత ఇండియా అనుసరించే విధానాలపై పాకిస్తాన్ దృష్టి పెట్టింది.  1954 వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని పూర్తిగా ఇండియాలో విలీనం చేసింది.  రెండు జెండాల స్థానంలో ఇప్పుడు అక్కడ ఒకేటే జెండా... దేశంలోని అన్ని చట్టాలు అక్కడ కూడా అమలు జరుగుతాయి.  అంతేకాదు, ఆ రాష్ట్రానికి కేంద్రం ఏడేళ్లపాటు టాక్స్ ఫ్రీ ప్రకటించింది. రాష్ట్రం అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తోంది.  ఉద్యోగాల కల్పన కోసం ఇండస్ట్రీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యింది.  


యువతకు ఉద్యోగాల కల్పన లేక, చదువుకోవడానికి సరైన వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఇకపై ఆ ఇబ్బందులు అక్కడ ఉండవు.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఎక్కువమంది యువత రక్షణ వ్యవస్థలో జాయిన్ కావడానికి ముందుకు వస్తున్నారు.  అక్కడ పోలీస్, ఆర్మీ రిక్రూట్మెంట్లో యువత ఎక్కువగా పాల్గొన్నది.  ఉద్యోగాల కల్పన రక్షణ రంగం నుంచే మొదలుపెట్టారు.  రెండు నెలల్లో 50వేల ఉద్యోగాలు కల్పిస్తామని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  


జమ్మూ కాశ్మీర్లోని చాలామంది నాయకులు గృహనిర్భందంలోనే ఉన్నారు.  ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చేవరకు వారు గృహనిర్బంధంలోనే ఉంటారని పేర్కొన్నారు అజిత్ దోవల్.  ఇక ఇదిలా ఉంటె, కేంద్రం నెక్స్ట్ అజెండా ఏంటో ఇప్పటికే స్పష్టం అయ్యింది.  1947 స్వతంత్రం వచ్చిన తరువాత ఇండియాలో భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ను పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకుంది.  అయితే, 1994లో కాంగ్రెస్ ప్రధాని పివి నరసింహారావు పీవోకే ఇండియాలో భాగస్వామ్యం అని దాన్ని తిరిగి ఇండియాలో కలిపేసుకోవాలని పార్లమెంట్ లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.  


దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  2022 నాటికీ పీవోకే ఇండియా సొంతం అవుతుందని, మోడీ నాయకత్వంలో అఖండ భరతం సాధ్యం అవుతుందని అన్నారు.  అటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఇదే విధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.  భారత ప్రభుత్వం నెక్స్ట్ అజెండా పీవోకే అని.. దాన్ని తిరిగి సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.  రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్నిస్తున్నాయి.  మొత్తంగా చూసుకుంటే.. రాబోయే రెండు మూడేళ్ళలో పీవోకే తిరిగి ఇండియాలో కలిసిపోతుంది అని మాత్రం స్పష్టంగా అర్ధం అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: