నరేంద్ర మోడీ అంటే రికార్డుల వరద పారించే మొనగాడు అంటారు. ఆయన వరసగా గుజరాత్ ముఖ్యమంత్రిగా గెలవడమే ఒక రికార్డు అనుకుంటే, జాతీయ రాజకీయాల్లోకి వస్తూనే ఏకంగా ప్రధాని అయిపోయి మరో రికార్డు స్రుష్టించారు. అప్పటివరకూ ముప్పయ్యేళ్ళుగా సంకీర్ణ రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న భారతానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించిన ఘనత కూడా మోడీదే. అంతే కాదు, బీజేపీకి కలగా మారిన పూర్తి మెజారిటీ మ్యాజిక్ ని కూడా ఒంటి చేత్తో సాధించిన మోడీ మరో రికార్డు క్రియేట్ చేశారు.


దేశంలో పెద్ద నోట్ల రద్దు, పాక్ పై మెరుపుదాడులతో మోడీ మరిన్ని రికార్డులను అయిదేళ్ళ పాలనలో స్రుష్టించారు. ఇక రెండవమారు మోడీ గెలవరని అంతా అనుకుంటున్న వేళ 2014 కి మించి సీట్లను సంపాదించడం ద్వారా తన రికార్డు తానే బద్దలు కొట్టారు మోడీ. ఇన్ని రికార్డులున్న మోడీకి ఇపుడు జతగా మరో రికార్డు వచ్చింది. అదేమంటే సోషల్ మీడియాలో అయిదు కోట్ల మంది ఫాలోవర్స్ కలిగిఉన్న మొదటి బారతీయుడుగా మోడీ ఘనమైన రికార్డు క్రియేట్ చేశారు.


సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం ట్విట్టర్లో మోడీని అనుసరిస్తున్న వారి జాబితా అక్షరాల 5 కోట్లు దాటేసింది. ఇక ప్రపంచ రికార్డు పరంగా చూస్తే మోడీ మూడవ స్థానంలో ఉన్నారు. వరల్డ్ రికార్డులో మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 10.8 కోట్ల మంది ఫాలోవర్స్  తో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో  ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు 6.4 కోట్ల మంది ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో నిలవగా మోడీ 5 కోట్ల మందితో మూడవ స్థానంలో ఉన్నారు. తొందరలో మోడీ ప్రపంచ రికర్డు ని సాధించి మొదటి స్థానానికి వస్తారని అంతా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: