ఏనిమిషాని ఏం జరుగుతుందో తెలియదు అన్న కవి మాటలు అక్షరాల నిజమే అనిపిస్తున్నాయి.నిన్న మొన్నటి వరకు రేసు గుర్రాల్లా పరిగెత్తిన బంగారం ఒక్కొక్క మెట్టు  దిగుతూ మళ్లీ మొదటికి వస్తున్నట్లు కనిపిస్తుంది.పెరిగిన ధరలతో హడలిపోయిన వినియోగదారులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇక ఈ రోజు మార్కెట్లో బంగారం రేటు ఏవిధంగా వుందో ఓ సారి పరిశీలిద్దాం..



హైదరాబాద్ మార్కెట్‌లో గరువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.39,660కు తగ్గింది.గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు,రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.ఒక రకంగా ఈ విషయం బంగారం ప్రియులకు ఆనందకరంగా చెప్పవచ్చూ.ఇక ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో దీని రేటు రూ.38,300కు దిగొచ్చింది ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.37,100కు తగ్గింది.ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.1,900 పతనమైంది.ప్రస్తుతం రూ.51,300కు పడిపోయింది.



అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 తగ్గుదలతో రూ.36,340కు క్షీణించింది.పరిశ్రమ యూనిట్లు,నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ క్షీణించడం ఇందుకు కారణం.విజయవాడ,విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది.పసిడి ధర ఔన్స్‌కు 0.17 శాతం తగ్గుదలతో 1,500.55 డాలర్లకు క్షీణించింది.అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గుదలతో 18.14 డాలర్లకు దిగొచ్చింది.ఇక రానున్నది పండగల సిజన్ కాబట్టి దిగిన బంగారం ధరలతో బంగారం షాపులకు పూర్వ వైభవం వస్తుందని వ్యాపారులు ఆశిస్తున్నారు.ఇప్పటివరకు గోల్డ్ కొనుక్కోవాలని ఆశించి భంగపడ్ద వనితలకు ఇదో సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు..ఇప్పటికే అధిక ధరలకు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నాయనే వార్త కాస్త చేదుగా అనిపించవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: