ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం రచ్చ జరగని రోజు లేదు. చంద్రబాబు జమానాలో అద్భుత రాజధాని అంటూ ప్రతీ రోజూ అనుకూల మీడియా వూదరగొడితే ఇపుడు అదే టీడీపీ అనుకూల మీడియా అమరావతి మీద, జగన్ సర్కార్ విధానాల మీద వ్యతిరేక కధనాలు వండి వారుస్తోంది. మరో వైపు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయ‌ణ అమరావతి మీద చేస్తున్న కామెంట్స్, రాయలసీమకు చెందిన వివిధ పార్టీల నేతలు అక్కడే రాజధాని పెట్టాలంటూ పెడుతున్న డిమాండ్లు మొత్తానికి అమరావతి రాజధాని ఇపుడు బర్నింగ్ ఇష్యూగా మారిందనే చెప్పాలి.


ఈ సమయంలో ప్రభుత్వం స్పందన ఏంటన్నది అందరికీ ఆసక్తిగా ఉంది. ఓ వైపు సీనియర్ మంత్రి బొత్స అమరావతి కధను వినిపిస్తున్నా జగన్ ఈ విషయంలో మాట్లాడాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఈ విషయానికి తన మౌనమే సమాధానం అంటున్నారు. ఆయన వైఖరితో విపక్షాలు మరింతగా మండిపోతున్నాయి. ఇదిలా ఉండగా సింగపూర్ టూర్లో ఉన్న ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అమరావతి కధను కొంతవరకూ తేల్చే పనిలో పడ్డారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి గురించి కొన్ని కఠిన వాస్తవాలను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.


అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ ఏకంగా ఆర్ధిక మంత్రి కుండ బద్దలు కొట్టేశారు. అమరావతి నిర్మాణం అంటే లక్షల‌ కోట్ల వ్యవహారంగా పేర్కొన్న మంత్రి ఖజానా ఖాళీగా ఉందన్న సంగతి తేల్చిచెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివ్రుధ్ధి చేయడమే తమ ప్రభుత్వం పెట్టుకున్న అత్యధిక ప్రాధాన్యత అంశంగా చెప్పుకొచ్చారు. అంటే ఓ విధంగా అమరావతి విషయంలో ఆర్ధిక మంత్రి కామెంట్స్ వల్ల ఇపుడు కొన్ని డౌట్లు తీరాయ‌నే అనుకోవాలి. అమరావతి రాజధాని కంటే ఏపీ సమ‌గ్ర అభివ్రుధ్ధి తమ లక్ష్యమని చెప్పడం ద్వారా జగన్ సర్కార్ ఏపీలోని మిగిలిన ప్రాంతాల మీద ద్రుష్టి పెడుతుందని తేలిపోయింది.


అంటే బాబు అనుకుంటున్న అమరావతి నిర్మాణానికి జగన్ సిధ్ధంగా లేరని కూడా క్లారిటీగా తేలిపోయింది. కాగా భారత్-సింగపూర్ వ్యాపార ఆవిష్క‌కరణ సదస్సుకు ఏపీ తరఫున  హాజరైన మంత్రి బుగ్గన  అక్కడి పత్రిక  ద స్ట్రైట్ టైమ్స్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే అమరావతి విషయంలో వైసీపీ సర్కార్ పక్కా ప్లాన్ తోనే  ఉందని, గందగోళం ప్రతిపక్షంలోనే ఉందని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: