సుమారు మూడు సంవత్సరాల క్రితం ఒక బాలుడు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేయించుకోవటానికి తన అర్దిక స్థితి సహకరించండంలేదు. ఈ పరిస్థితుల్లో  కొందరి దాతల సహయ సహకారంతో వైద్య  సహాయాన్ని పొందుతున్నాడు. జీవితాంతం మెడిసిన్ వాడ వలసి ఉండటంతో మిగిలిన నగదును తన బంధువుల ద్వారా బంగార వ్యాపారి వద్ద భద్రపర్చుకున్నాడు. అయితే మానవత్వం లేని ఆ పెద్ద మనిషికి  కిడ్నీ బాధితుడి డబ్బులు ఇవ్వాలన్న దయ కూడా లేకుండా పోయింది.



వాస్తవానికి ఆ వ్యాపారి ఇంటిపైన ఉన్న పోర్షన్ లోనే బాధితుడు నివాసముంటున్నాడు. వ్యాపారి కఠిన వైఖరిని అవలంభించడంతో ఇక నుంచి నెల నెల మందులు ఏలా కోనుగోలు చేయాలో అర్ధం కాని దిక్కుతోచని స్థితిలో కిడ్నీ బాధితుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ పరిణామాల నేపధ్యంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడిని మోసం చేసిన ఈ వ్యాపారిపై ప్రభుత్వం పరంగా కఠినంగా శిక్షించి  న్యాయం చేయాలని పలువురు మానవతావాదులు వేడుకుంటున్నారు. 




ఇదిలా ఉండగా పట్టణంలోని ఒక మహిళ కొన్ని ఇళ్లల్లో, దేవాలయంలో పని చేసుకుంటూ  కూడపెట్టుకున్న నగదును కూడా స్వాహా చేసిన సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. పైసా పైసా కూడ గట్టుకుని ఈ వ్యాపారి వద్ద దాచుకుంది. చివరికి ఆ నగదును కూడా మానవతా దృక్పథం లేని ఆ వ్యాపారి ఆమెను మోసం చేశాడు.  ఈ పరిస్థితుల్లో ఆమె ఏవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితి. ఇదే విధంగా మరి కొందరు పేద, మధ్య తరగతి ప్రజలు కూడా వివిధ అవసరాల నిమిత్తం దాచుకున్న డబ్బులు గోల్ మాల్ అయ్యాయి. కొసమెరుపు ఏటంటే ఇందరి నమ్మకాన్ని సొమ్ము చేసుకున్న ఆ   బంగారపు వ్యాపారి తాతా గోపాలకృష్ణ మూర్తి కన్పించకుండాపోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: