వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకదాని తరువాత మరొకటిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు.  ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్న జగన్, టెండర్ల విషయంలో మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటికే వరకు టెండర్ల విషయంలో అన్నింటికీ ఒకేలా ఫాలో అయ్యేవారు.  పెద్దగా రూల్స్ ను పట్టించుకునే వారు.  దీంతో కొన్ని సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కుతూ వస్తున్నాయి.  ఇకపై టెండర్ల విధానంలో పారదర్శకతను పాటించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  


ఇందులో భాగంగానే రాష్ట్రంలో రూ. 100 కోట్లు  దాటిన ప్రాజెక్టులన్నీ ఇకపై న్యాయసమీక్ష తర్వాతే ముందుకు వెళ్తాయి.  దేనికోసం హైకోర్టు జడ్జీని నియమించింది.  హైకోర్ట్ జస్టిస్  బి.శివ శంకర్ రావు నియమితులైనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ప్ర‌ధాన న్యామ‌మూర్తి సిఫార్సు మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రూ. 100 కోట్ల రూపాయల టెండర్లను ముందుగా అయన సమీక్షిస్తారు.  అయన సమీక్ష తరువాత మాత్రమే ప్రాజెక్టు కాంట్రాక్టులను ప్రభుత్వం ఒకే చేస్తుంది.  


గత ప్రభుత్వం హయాంలో టెండర్లను కొందరికి మాత్రమే కట్టబెట్టింది.  దీంతో ఆయా ప్రభుత్వాలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులే లాభాలు పొందారు.  కాంట్రాక్టులు దక్కించుకున్నారు.  ఇకపై అలా కుదరదు.  టెండర్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.  అందుకోసమే ఈ నిర్ణయం తీసుకుంది.   తాము జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తామన్నారు. మాట చెప్పినట్టుగానే మూడు నెలలలోపు న్యాయసమీక్షను అమలులోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ఏదైనా టెండర్ రూ. 100 కోట్లు దాటితే ఆ టెండర్ కు సంబంధించిన డాక్యూమెంట్లను పబ్లిక్ డొమైన్ లో పెడతారు.  ప్రజల నుంచి, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారు.  వారం రోజుల్లో వచ్చిన సలహాలు సూచనలు తీసుకొని సదరు వ్యక్తులకు ఆ కాంట్రాక్టు ఇవ్వొచ్చా లేదా అన్నది జడ్జి నిర్ణయిస్తారు.  ఈ మొత్తం ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి కావాలి.  బిడ్డింగ్ జరిగి కాంట్రాక్టు దక్కుతుంది.  ఈ విధానం సక్రమంగా అమలు జరిగితే.. గొప్ప నిర్ణయంగా మారుతుంది.  చరిత్రలో మిగిలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: