ఆంధ్రప్రదేశ్ లో 13గా ఉన్న జిల్లాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వేగవంతమయ్యాయని తాజా సమాచారం. ఇందుకు తగ్గ విధివిధాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షనేతగా జగన్ తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంచుతానని హామీ ఇచ్చారు. జగన్ సీఎంగా అధికారం చేపట్టాక దీనిపై దృష్టి సారించారు. దీంతో జిల్లాల పెంపుకు ముహూర్తం కూడా నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 


జిల్లాల పెంపులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలని జగన్ ఆలోచన. ఇందుకు సంబంధించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో బుధవారం చర్చించినట్టు సమాచారం. జిల్లాల పునర్విభజన చేయడం ద్వారా పాలన సులభతరం అవుతుందని, ప్రజలకు అందించే సేవలు విస్తృతమవుతాయని వివరించినట్టు తెలుస్తోంది. గవర్నర్ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. వచ్చే నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి 2020 జనవరి 26 నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యమని సమాచారం అందుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాలపై కసరత్తు జరుగుతోందని త్వరలోనే ఓ కొలిక్కి రానుందని తెలుస్తోంది. రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండడంతో కొత్తగా ఏర్పడే జిల్లాల సంఖ్య 25కు పరిమితమా ఇంకా పెరుగుతాయా అనేది తెలియాల్సి ఉంది.

 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడి 5ఏళ్లు పూర్తయింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ తొలి విడత పాలనలోనే రాష్ట్రాలను పెంచారు. ఇచ్చిన మాట ప్రకారం 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలకు పెంచారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 13 జిల్లాలు అలానే ఉన్నాయి. సీఎం జగన్ నిర్ణయంతో ఇకపై ఏపీలో కూడా జిల్లాలు పెరుగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: