గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఏపీ సీఎం జగన్.. దాని ద్వారా ప్రజలకు అద్భుత ఫలితాలు అందించాలనుకుంటున్నారు. జనం తమకు సమస్య ఉంది అని గ్రామ సచివాలయాన్ని  ఆశ్రయించిన మూడు రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యేలా  గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  అధికారులను ఆదేశించారు. 


వాస్తవానికి ఈ హామీ అమలైతే.. నిజంగా జనం జీవితాల్లో విప్లవాత్మక మైన మార్పు వచ్చేసినట్టే.. ప్రజలకు కావాల్సింది తమ సమస్యలు తీరడమే కదా.. అదే నిజమైతే.. ఇంక ఆ పాలకుడిని నెత్తిన పెట్టుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయాలపై సంబంధిత  ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.


ప్రజల సమస్యలపై స్థానికంగా స్పందించడానికి గ్రామ సచివాలయానికి ప్రత్యేకంగా ఒక నంబర్‌ ఉండాలన్నారు. 72 గంటల్లోగా సమస్యను తీర్చడానికి అవసరమైన విధంగా సచివాలయాల్లో ఏర్పాట్లు ఉండాలని అధికారులను జగన్  ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డేటా సెంటర్‌ కూడా ఉండాలన్నారు. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి గ్రామ సచివాలయం నుంచి సంబంధిత శాఖాధిపతిని అప్రమత్తం చేసేలా వ్యవస్థ ఉండాలని సూచించారు. 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి తనకు కేటాయించిన పనుల విషయంలో ప్రజలకు పూర్తి సహాయకారిగా తోడ్పాటు అందించేలా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థలపై మానిటరింగ్‌ చాలా ముఖ్యమైందని, వలంటీర్ల వ్యవస్థల కోసం మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అంతే కాదు.. ప్రభుత్వ పథకం ఏదైనా కూడా సాంకేతిక కారణాలతో నిరాకరించరాదని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. ఏదేమైనా జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలన్నీ అమలైతే పల్లెల రూపరేఖలు మారడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: