ప్రభుత్వ పాఠశాలులు.. ఇన్నాళ్లూ ఎవరికీ పట్టని అంశం ఇది. ఏదో ఉపాధ్యాయులను నియమించామా.. జీతాలు ఇస్తున్నామా అనే విషయం తప్ప.. అక్కడ చదువు ఎలా ఉంది.. పేదల భవిష్యత్ మారుతుందా.. మారడానికి ఇంకేమైనా చేయాలా అని ఆలోచించిన నాయకుడు లేడు. కానీ ఇప్పుడు జగన్ సర్కారు తీరు చూస్తే.. సర్కారు బడికి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది. 


ఎందుకంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, పాఠశాలల బలోపేతానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్‌ టు వరకు పెంచాలంటున్నారు. జూనియర్‌ కాలేజీల స్థాయికి వాటిని తీసుకెళ్లాలంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగుచేయడంపై ప్రణాళిక రూపొందించాలంటున్నారు. 


అంతే కాదు.. నాడు–నేడు కింద 44,512 పాఠశాలలను బాగుచేయనున్నట్లు జగన్ చెప్పారు. మొదటి విడతలో 15,410 స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమం, తొమ్మిది రకాల కనీస వసతులు కల్పించనున్నట్లు  సీఎం జగన్ వివరించారు. చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, రాజీపడొద్దని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. స్కూళ్లల్లో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల రాటిఫికేషన్‌ ఉండేలా చూడాలన్నారు. విద్యా కమిటీలు సామాజిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. 
వచ్చే ఏడాది నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఆ తరువాత 9, 10 తరగతులకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన చేపట్టనున్నట్లు వివరించారు. 70 వేల మంది టీచర్లకు ఇంగ్లిష్‌ బోధనలో శిక్షణ ఇచ్చేలా డైట్స్‌ను బలోపేతం చేసేలా ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తి చేయాలన్నారు. 


ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో పెట్టాలని సూచించారు. పర్యావరణ, వాతావరణ మార్పులు, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు ఉంచాలన్నారు. వచ్చే ఏడాది నుంచి పుస్తకాలు, యానిఫాంలు, షూ, స్కూల్‌ బ్యాగులు స్కూల్‌లో చేరిన రోజే ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన గుడ్డు విద్యార్థులకు అందేలా ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై ఆలోచన చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. మరి ఇవన్నీ అమలైతే సర్కారు బడులు అసలైన విద్యానిలయాలుగా మారతాయనడంలో ఆశ్చర్యం ఏముంది..?


మరింత సమాచారం తెలుసుకోండి: