గత 12 రోజులుగా కొత్త ట్రాఫిక్ చట్టంతో మధ్యతరగతి ప్రజలు అల్లాడి పోతున్నారు. కొంతమంది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానాలు పడితే.. మరికొందరికి అనవసరంగా జరిమానాలు వేసి ప్రజలను ఇబంధుల పాలు చేస్తున్నారు కొంతమంది. అయితే కొత్త చట్టం తీసుకొచ్చింది యాక్సిడెంట్స్ జరగకూడదని, అందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించే వారిలా ఉండాలని ఈ కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేశారు.         


అయితే ఈ కొత్త ట్రాఫిక్ చట్టంతో వాహనదారులు వారి జరిమానాలు చూసి గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు ఉన్నటు. మరికొందరు మధ్యతరగతి ప్రజల మీద ఎక్కువ భారం పడుతుందని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.                     


కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన ట్రాఫిక్ చట్టాన్ని, జరిమానాలను వారు అమలు చేసేది లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు మమతా బెనర్జీ. కేంద్రం నిర్ణయించిన జరిమానాలపై బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వవమే పెద్ద మొత్తంలో జరిమానాలు కోత విధించిన నేపథ్యంలో మమత బెనర్జీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


జరిమానాల రూపంలో మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందన్న అధికారుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని, అందుకే ఈ చట్టాన్ని అమలు చేయబోవడం లేదని ఆమె వెల్లడించారు. కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తాము సైతం గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించిన జరిమానాలను అమలు చేస్తామని ప్రకటించడం గమనార్హం. మరోవైపు మహారాష్ట్ర రవాణా మంత్రి దివాకర్ రావోత్ ఈ చట్టం అమలును తమ రాష్ట్రంలో తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఈ ముఖ్యమంత్రులు అయితే ప్రజలకు అనుకూలంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.. మరి ఈ నిర్ణయాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: