రక్షణ వ్యవస్ధలో భారత్ మరో ముందడుగు వేసింది.నిర్ణీత సమయానికి లక్ష్యాన్నిచేరే అతి తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ పరీక్ష విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లువద్ద ఆర్మీసహకారంతో డీఆర్‌డీవో నిర్వహించిన క్షిపణి పరీక్ష విజయవంతమైనట్టు డీఆర్‌డీవో అధికారులు తెలిపారు.ఒక ఆర్మీ జవాను మోసుకెళ్లేలా డీఆర్‌డీవో రూపొందించిన క్షిపణి,ఎలాంటి అడ్డంకులు సృష్టంచకుండా గమ్యాన్నితాకినట్టు వారు పేర్కొన్నారు.ఓర్వకల్లు వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న డీఆర్​డీవో పరిశ్రమలో చేపట్టిన ఈ ప్రయోగం,భారత సైన్య ఆయుధసంపత్తిని మరింతగా ఇనుమడింప జేసిందని తెలిపారు..



14.5 కిలోల బరువు కలిగి 2.5 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదించగలిగే ఈ క్షిపణిని డీఆర్​డీవో 2015 నుంచి అభివృద్ధి చేస్తూ వస్తోంది.ఇక దీనిలో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని యుద్ధ ట్యాంకుల్ని విధ్వంసం చేయగిలిగిన శక్తివంతమైన పేలుడు పదార్థంతో కూడిన వార్​హెడ్ దీనికి ఉంది.ఇక ప్రయోగాత్మక పరీక్షల కోసం డీఆర్​డీవో 2018 చివరి నాటికి దీని ప్రొటోటైప్​ను భారత సైనానికి అప్పగించింది.ఈ సైన్యం ఈ ఏడాది మార్చి 13,14 తేదీల్లో రాజస్థాన్​లోని ఎడారి ప్రాంతంలో డీఆర్​డీవో తో కలసి వరుసగా రెండు ప్రయోగాలు చేసింది.ఇక దీని ఉత్పత్తి 2021 నుంచి పెద్ద ఎత్తున మొదలవుతుందని తెలిపారు.



పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణుల సామర్థ్యంపై రక్షణశాఖ మొదట అనుమానం వ్యక్తం చేసి,విదేశాల్లో తయారైన వాటి వైపు మొగ్గుచూపింది.అయితే క్షిపణులన్ని వరసగా లక్ష్యాన్ని ఛేదించటంతో రక్షణశాఖ సంతోషం వ్యక్తం చేసింది.మూడు ప్రయోగాలు విజయవంతం కావటంతో సైన్యానికి కావాల్సిన తేలికపాటి క్షిపణులు త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తోందని డీఆర్​డీవో ఓ ప్రకటనలో వెల్లడించింది.ఇక ఈ ప్రయోగాలు విజయవంతం కావటంతో సైన్యం కోసం మూడో తరం క్షిపణిని దేశీయంగా అభివృద్ధి చేసి ఇవ్వడానికి మార్గం సుగమమైందని ఈ సందర్భంగా పేర్కొంది.ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తైన సందర్భంగా డీఆర్​డీవో బృందాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ అభినందించారు...

మరింత సమాచారం తెలుసుకోండి: