పల్నాడు లో గొడవ ప్రస్తుతానికైతే సద్దుమణిగింది కానీ ప్రస్తుతం ప్రభుత్వం పని అసలు ఇంత పెద్ద గందరగోళం ఎక్కడ మొదలైందని విచారణ చేపట్టింది. అలా గుట్టంతా తవ్వి తీస్తున్న తరుణంలో చాలా ఆసక్తి కరమైన విషయాలు బయటకు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టింది సరే… అయితే అసలు అక్కడ గొడవకి కారణం ఎవరు. ముందు కారుచిచ్చు అంటించింది ఎవరు అన్న విషయంపై పోలీసులు విచారిస్తుండగా.... ఒక నలుగురు ఎమ్మెల్యేల పై అనుమానం వచ్చిందట. వారే చింతమనేని ప్రభాకర్, ఎరపతినేని శ్రీనివాసులు.

గత పది రోజులుగా ఈ నాయకులిద్దరూ ఆచూకీ లేకుండా ఉన్నారు. ఏదో కేసు విషయమై అరెస్టుని తప్పించుకుని తిరుగుతున్నారు అని అనుకుంటున్న తరుణంలో సరిగ్గా గొడవ సమయానికి అప్పటి వరకు అడ్రస్ లేని చింతమనేని ప్రభాకర్ కాస్తా సంఘటన స్థలాన్ని దగ్గర కనిపించి అక్కడ పరిస్థితి యొక్క తీవ్రతను మరింత పెంచేశాడు. చింతమనేని ప్రభాకర్ మరియు యారపతనేని శ్రీనివాసులు యొక్క నియోజకవర్గాలు దాడులు జరిగిన స్థలాలకి దగ్గరే. ఇక మన చింతమనేని గూండా రాజకీయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత పది రోజులుగా వీరందరూ ఒకచోట కూర్చొని మాస్టర్ ప్లాన్లు వేస్తున్నట్టు వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇకపోతే సోమిరెడ్డి పైన డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి భూములను ఆక్రమించిన కేసులు ఉన్నట్లు తెలిసిందే. సోమిరెడ్డి స్వభావ పూర్వకంగా అలాంటి వాడు  కాకపోయినా.... ఈయన కూడా ఈ మధ్య ఎక్కడా కనిపించకపోవడంతో ఇందులో అతని హస్తం ఉందన్న వాదనలను కొట్టిపారేయలేము. మరో పక్క వీరితో పాటు కూన రవి కుమార్ కూడా గత కొన్ని రోజులుగా ఆచూకీ లేడు. ఇతని పై ఇప్పటికే ఒక గవర్నమెంటు ఆఫీసుపై దాడి చేసిన కేసు ఉంది. వీరందరూ కలిసి ఎదైనా మాస్టర్ స్కెచ్ వేశారు అన్న అవకాశాలను కూడా కొట్టిపారేయలేము.

తమ సమీప ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంటే… తమ నియోజక వర్గం నుంచి కూడా అదే పార్టీ మద్దతుదారులు అక్కడికి వెళ్లి రభస సృష్టిస్తూ ఉంటే అసలు పట్టించుకోకుండా ఎక్కడికో వెళ్లిపోయి కచ్చితంగా ధర్నా సమయానికి రావడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జగన్ 100 రోజుల పాలనను విమర్శించిన చంద్రబాబు మరియు అతని కొడుకు లోకేష్ … జగన్ ను ఎలా దెబ్బకొట్టాలో తెలీక ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డాడన్నది అందరూ నోటా నానుతున్న మాట. రానున్న రోజుల్లోనే జగన్ దీనిపై హైలెవెల్ ఆఫీసర్స్ తో దర్యాప్తు చేయించి నివేదిక రెడీ చేయమని ఆదేశించబోతున్నాడట. అప్పుడు బయట పడతాయి అందరి పేర్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: