గడచిన మూడు నెలల్లో చేసిన రాజకీయానికి ప్రత్యేకించి చలో ఆత్మకూరు పిలుపు నేపధ్యంలో చంద్రబాబునాయుడుకు నెగిటివ్  మార్కులే వస్తాయి. ఒకవైపు టిడిపి నేత జేసి దివాకర్ రెడ్డి నూరు రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి నూటపది మార్కులు పడతాయని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అంటే సిఎంగా పరిపాలనలో గాని హామీల అమలు విషయంలో కానీ జగన్ చూపిస్తున్న చొరవకు జేసి వేసిన మార్కులివి.

 

టిడిపి సీనియర్ నేతే జగన్ కు నూటికి నూటపది మార్కులు వేస్తానని చెప్పినపుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు ఎన్ని మార్కులు వస్తాయనే విషయంలో చర్చ జరగటం సహజమే కదా ?  మరి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏ స్ధాయిలో పనిచేశారు ? అంటే బాగా పనిచేశారని టిడిపి నేతలే చెప్పలేని పరిస్ధితి.

 

ఎందుకంటే చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకే పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. నాయకుడి సామర్ధ్యం మీద నమ్మకం లేనపుడు ఇక పనితీరుపై మార్కులేమని వేయాలి ? అందుకే నెగిటివ్ మార్కులు వస్తాయని తేల్చింది. నెగిటివ్ మార్కులెందుకంటే జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేయటానికి పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపినందుకు. అక్రమ నిర్మాణంలో ఉంటూ కరకట్టపై నుండి వరదల సమయంలో బురద రాజకీయాలు చేసినందుకు.

 

అడుగడుగునా సిఎంగా జగన్ ఫెయిలయ్యాడని నిరూపించేందుకు చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. ఇంతా చేసి జగన్ అధికారంలోకి వచ్చి నూరు రోజులే అయ్యింది. నూరు రోజుల్లో ఎవరు కూడా ఎటువంటి ఫలితాలు చూపలేరన్నది వాస్తవం. మరి జగన్ ఏమి చేశారు ? ఏమి చేశారంటే హామీలను అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తునే, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీసే పనిలో పడ్డారు. ఇందుకే చంద్రబాబు జగన్ కు వ్యతిరేకంగా ఇంత రచ్చ చేస్తున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: