ప్రతి వినాయకచవితికి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని భారీస్థాయిలో అద్భుతంగా కొలువుదీరే ఖైరతాబాద్ గణనాధుడు, ఈ ఏడు కూడా మరింత శోభాయమానంగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇప్పటికే పలువురు ప్రజలు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ మహా గణనాధుని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది. ఇక నేడు ఆ గణనాధుని విగ్రహం నిమజ్జనం సందర్బముగా పలు ఏర్పాట్లు చేసిన అధికారులు, అందుకోసం ప్రత్యేకమైన వాహనాలను నియోగించనున్నారు అధికారులు. 

గతంలో ఆరు సార్లు ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం సందర్బముగా ట్రాలీ నడిపిన అదే డ్రైవర్ భాస్కర్ రెడ్డిని, ఈ ఏడాది కూడా నియోగించడం జరిగింది. ఇక ఈ మహాగణపతి విగ్రహ తరలింపు కోసం ఈ ఏడాది తెప్పించిన ప్రత్యేకమైన ట్రాలీ 26 టైర్లతో 11 అడుగుల వెడల్పు, 70 పొడవు కలిగి ఉంటుంది. అలానే 55 టన్నులవరకు బరువును ఎంతో తేలికగా లేవనెత్తగల ఈ ట్రాలీ, అక్కడి చూపరులను ఆకర్షిస్తోంది. అలానే దానితోపాటు జర్మన్ టెక్నాలజీ ఆధారిత క్రేన్ ని ప్రత్యేకంగా నియోగిస్తున్నారు. రిమోట్ సాయంతో పనిచేసే ఈ క్రేన్ బరువు 72 టన్నులు. దీనికి 400 టన్నుల మేర బరువును ఎత్తగల సామర్థ్యం ఉంది. 

అలానే దాని జాక్‌ 61 మీటర్ల ఎత్తు వరకు సునాయాసంగా లేపగలదు. దాని పొడవు 14 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. మొత్తం ఈ క్రేన్ కు 12 టైర్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ క్రేన్ కు డ్రైవర్‌ గా దేవేందర్‌సింగ్‌ రెండవసారి ఈ గణనాధుని విగహ నిమజ్జంలో పాల్గొన్నాడు.  ఇప్పటికే ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించడం జరిగింది. ఇక దారిపొడవునా ఈ భారీ గణనాథునికి ప్రజలు పూజలు, హారతులు ఇస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కాగా ఈ గణనాధుని నిమజ్జనం పూర్తి అయ్యేసరికి సాయంత్రం అవుతుందని అంటున్నారు అధికారులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: