ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం ఎక్కినప్పటి నుండి ప్రజలకు సుపరిపాలన అందించాలని నిరంతరం జగన్ ప్రభుత్వం భావిస్తుంది . ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారు సీఎం జగన్ . అయితే జగన్ పాలన అద్భుతంగా ఉందంటూ పలువురు కితాబించిన సంగతి తెలిసిందే . సరి కొత్త పథకాలను ప్రవేశ పెడుతూ ... పాలనలో జగన్ తనదైన  ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు . ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుండగా ...కొత్త జిల్లా ఏర్పాటు అంశాన్ని కూడా జగన్ అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది .


మొదట్లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం పై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ ... ఆ తర్వాత మాత్రం ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకే ...కొత్త జిల్లా ల మార్పు చేపట్టాలనే ఉందేశ్యం తో ఈ ప్రతి పాదన   పక్కన పెట్టారు . కాగా ఇటీవలే గవర్నర్ ని కలిసిన జగన్ ...ఆయనతో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని చర్చినట్లు సమాచారం. అయితే ఈ కొత్త జిల్లా మార్పు అంశంలో భాగంగా ... వచ్చే గణతంత్ర దినోత్సవం రోజు జగన్ కొత్త జిల్లాల మార్పు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం  ఉందని భావిస్తున్నారు .అయితే ఇప్పటికే కొత్త జిల్లాలకు ఏర్పాటుకు  సంబంధించి అంతర్గతంగా కసరత్తులు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.  ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం తో పాటు మరి కొన్ని నూతన జిల్లా జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశషం ఉందని వార్తలు వస్తున్నాయి .కొత్త జిల్లాల ఏర్పాటుతో  రాష్ట్ర  అభివృద్ధిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుంటుందని ... ప్రజలకు మెరుగైన పాలన అందించవచ్చని జగన్ భావిస్తున్నారట జగన్ 


మరింత సమాచారం తెలుసుకోండి: