తిరుమల శ్రీవారి భక్తులు ప్రపంచం మొత్తం ఉంటారు. వెంకన్నను దర్శించుకోడానికి మన తెలుగు వాళ్ళు పక్క దేశాల్లో నివసిస్తున్నరు. అలానే మన తెలుగు వారు కూడా ఉద్యోగమని, వ్యాపారం అని పక్క దేశాల్లో స్ధిరపడ్డారు. ఆలా వేరే దేశంలో స్దిరపడ్డ ప్రవాసాంధ్రుడు వెంకన్నను దర్శించుకోడానికి ఆంధ్రకు వచ్చాడు. ఆలా దర్శనానికి వచ్చిన భక్తుడు శ్రీవారికి పెద్ద కనుకే ఇచ్చాడు ఆ ప్రవాసాంధ్రుడు.             


టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ నిత్యాన్న ప్రసాద ట్రస్టుకు ఎమ్ శ్రీనివాస రెడ్డి 1,00,00,116 రూపాయలు విరాళంగా సమర్పించాడు ఆ ప్రవాసాంధ్రుడు. ఎన్‌ఆర్‌ఐ ఎమ్‌. శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రంగనాయకుల మండపంలో విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రత్యేక అధికారి ఏవీ ధర్మారెడ్డికి స్వయంగా అందేజేశారు.                                           

                         

దీంతో తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి తనలోని భక్తిని చాటుకుంటూ, నిత్యాన్నదాన పథకానికి కోటీ నూటపదహారు రూపాయల విరాళాన్ని ఇచ్చి ఔదార్యాన్ని చాటాడు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డితో తిరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన అధికారులు, అనంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు ఆశీర్వచనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో అవిశ్రాంతంగా సాగే నిత్యాన్నదానానికి తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విరాళాన్ని అందించినట్టు ప్రవాసాంధ్రుడు ఎమ్ శ్రీనివాస రెడ్డి తెలిపారు.                               


మరింత సమాచారం తెలుసుకోండి: