గత పార్లమెంట్ ఎలెక్షన్లలో కాంగ్రెస్  ఘోర పరాజయాన్ని చవి చూసింది . కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని ఎక్కిన రాహుల్ ...కాంగ్రెస్ పార్టీ ని విజయ పథంలో నడిపిస్తాను... లేకపోతే రాజీనామా  చేస్తాను అని శబదం చేసినప్పటికీ... కాంగ్రెస్ మాత్రం విజయం సాధించలేదు .దీంతో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయక తప్పలేదు  . రాహుల్ రాజీనామా తర్వాత సోనియా గాంధీ అధ్యక్ష పదవిని చెప్పట్టారు .అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి పార్టీ పునర్వైభవం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుదని సోనియా గాంధీ. రాహుల్ రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీ పని ముగిసిపోయిందని ఎంతో మంది నేతలు పార్టీ మారిన విషయం తెలిసిందే . అయితే తాజాగా సోనియా గాంధీ పార్టీ సీనియర్  నేతలతో సమావేశం అయ్యి దిశా నిర్దేశం చేశారు .పార్టీ కి ప్రజలకి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందని ...పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ...పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావాలని అభిప్రాయం పిలుపునిచ్చారు . 


ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం పై పలు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ . బీజేపీ ప్రభుత్వ తీరుతో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందన్నారు  . ప్రజల తీర్పును బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.మహనీయుల సందేశాలను తమ పార్టీ ఎజెండా కోసం వాడుకుంటూ వక్రీకరిస్తున్నారని ఆరోపించారు .దేశా ఆర్థిక వ్యవస్థ అద్వానంగా ఉందని ... అన్ని రంగాలు నష్టాల బాటలో నడుస్తున్నాయని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు .తమ తప్పులను కప్పి పుచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రజలు దృష్టిని మళ్లిస్తోందని అన్నారు . బీజేపీ వైఫల్యాలను  ప్రజల్లోకి తీసుకెళ్లాలని ...ఒక స్పష్టమైన ఎజెండా తో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సోనియా గాంధీ .



మరింత సమాచారం తెలుసుకోండి: