ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ హవా ముగిసినట్లే కనిపిస్తోంది. రెండేళ్ళ క్రితం బాగా నచ్చుకున్న అధినాయకత్వం కన్నాను ఏరి కోరి మరీ పీఠం మీద కూర్చోబెట్టింది. నాడు కన్నాలో అనేక ప్లస్ పాయింట్లు కనిపించాయి. ఆయన కాంగ్రెస్ మాజీ మంత్రిగా మందీ మార్బలం కలిగి ఉన్నారని భావించారు. పైగా కోస్తాలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేతగా గుత్తమొత్తంగా ఆ ఓట్లను ఇటువైపు మళ్ళీఇస్తారని కూడా భావించారు. ఇక కన్నా సారధ్యంలో సార్వత్రిక  ఎన్నికలకు వెళ్తే  ఎన్నడూ లేనిది నోటా  కంటే తక్కువ ఓట్లు బీజేపీకి దక్కాయి.


దాంతో కన్నాను తప్పిస్తారని అపుడే వినిపించింది.  ఇక బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. సంస్థా గత ఎన్నికలే మిగిలాయి. వాటిని డిసెంబర్లోగా  పూర్తి చేసి కొత్త అధ్యక్షున్ని ఎన్నుకుంటారు. దాంతో అధ్యక్ష పదవిపై పలువురి కన్ను పడింది. అధ్యక్షుడి ఎన్నిక అంటే కేంద్ర నాయకత్వం నామినేట్ చేయడమే. దాంతో కన్నా ప్లేస్ లోకి రావడానికి పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. 


కన్నా కనుక కాకపోతే ఆ పదవి వరించే వారు ఎవరు ఉన్నా బీజేపీలోకి కొత్తగా చేరిన టీడీపీ నేతల కన్ను కూడా ఆ పదవిపైన పడిందని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కూడా బీజేపీ సీటు మీద కన్నేశారని టాక్ నడుస్తోంది. ఆయన బీజేపీలో చేరినా కూడా చంద్రబాబుని తన రాజకీయ గురువుగా భావిస్తున్ననని చెప్పుకున్నారు. ఈ క్రమంలో  బాబు మెచ్చిన సుజనా వంటి వారికి పీఠం అప్పగిస్తే ఏపీలో టీడీపీ పని మరింత సులువు అవుతుందని అంటున్నారు.


గతంలో కూడా బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన హరిబాబు చంద్రబాబు తో సన్నిహితంగా ఉండేవారు. ఓ విధంగా ఏపీ బీజేపీని కూడా బాబు నడిపించారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చ్చాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఎవరు అయినా వారు బాబుకి సన్నిహితంగా ఉండేవారే వస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో  తో న్యూస్ వస్తోంది.  చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: