తన కామవాంఛ తీర్చుకోడానికి కాలేజీ అమ్మాయిని ట్రాప్‌ చేశాడు యూపీకి చెందిన బీజేపీ సీనియర్‌ నేత. తన పలుకుబడిని ఉపయోగించి లైంగికంగా వేధించాడు. అయితే బాధితురాలు పక్కా ఆధారాలతో ఆ కామాంధుడి బండారాన్ని సోషల్‌ మీడియాలో పెట్టడంతో సీన్‌ రివర్స్ అయింది.  ఓ వైపు జనం అతన్ని అసహ్యించుకుంటుంటే.. మరోవైపు అతని అరెస్ట్‌కు కూడా రంగం సిద్ధమవుతోంది. 


గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన స్వామీ చిన్మయానంద లైంగిక వేధింపుల వ్యవహారం పెద్ద దుమారమే రేగుతోంది. 72 సంవత్సరాల వయసున్న ఈ వ్యక్తి..  తన పెద్దరికాన్ని కామవాంఛ తీర్చుకోడానికి వాడుకున్నాడు. ఓ మహిళను లైంగిక వేధించి ఇప్పుడు అందరితో  ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల చిన్మయానందకు చెందిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఓ యువతితో అతను మసాజ్‌ చేయించుకున్న దృశ్యాలు చూసి చాలా మంది షాకయ్యారు. తాము పెద్దమనిషిగా గౌరవిస్తున్నది ఈ కామాంధుడినా అనుకున్నారు.   


ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన మరో వీడియోలో తనను ఓ నేత ఏడాది కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ పేరు చెప్పకుండా ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. తర్వాత వారం రోజుల పాటు ఆమె కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదయ్యింది. తర్వాత రాజస్థాన్‌లో ప్రత్యక్షమైన బాధితురాలు... సుప్రీం కోర్టుకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు కోసం అత్యున్నత న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసింది. చిన్మయానందపై ఆరోపణలు చేస్తున్న మహిళను దాదాపు 15 గంటలపాటు విచారించింది సుప్రీం కోర్టు నియమించిన దర్యాప్తు బృందం. తనపై చిన్మయానందపై లైంగిక దాడి చేశారని సిట్‌ అధికారులకు వివరించింది బాధితురాలు. అలాగే దీనికి సంబంధించిన సాక్ష్యాన్ని ఓ పెన్‌ డ్రైవ్‌లో అందజేసింది.    


బీజేపీకి చెందిన చిన్మయానంద...  వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. చిన్మయానందకు చెందిన లా కాలేజీ లైబ్రరీలో బాధితురాలికి ఉద్యోగం ఇప్పించారు. తర్వాత హాస్టల్లో ఉండాలని సూచించడంతో ఆమె అక్కడ చేరింది. అయితే... స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసి... తనను బ్లాక్‌ మెయిల్‌ చేశారని చెబుతోంది బాధితురాలు. తనను లైంగికంగా వేధించారని వివరిస్తోంది. చిన్మయానందకు అదే తరహాలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కళ్లజోడులో కెమెరాను ఏర్పాటు అతని బాగోతాన్ని రికార్డు చేశానంటోంది.  చిన్మయానంద వయస్సు రీత్యా అతన్ని అత్యాచారం కేసులో అరెస్ట్‌ చేయడానికి పోలీసులు వెనుకాడుతున్నారని వాపోతోంది బాధితురాలు. మొత్తానికి ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకూ వెళ్లడంతో ఏ మలుపు తిరుగుతుందోనే ఆసక్తి నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: