ఈరోజు రాత్రికి మీ గుండెలను కాస్త బరువు చేసుకోండి. భారతదేశ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్, కపిల్ దేవ్ తర్వాత దేశానికి రెండోసారి ప్రపంచకప్ రుచి చూపించిన మొనగాడు, టెస్టుల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిచిన ఏకైక ధీరుడు… మహేంద్ర సింగ్ ధోనీ కొద్ది సేపట్లోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయమై ఆయన ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మీడియా ముందుకు వచ్చి లైవ్ లో మాట్లాడబోతున్నాడని సమాచారం.

దీనిని ఉద్దేశించే కోహ్లీ ఈరోజు ఉదయం గత వరల్డ్ కప్ టి20 మ్యాచ్ ను ఉద్దేశించి ధోనిని పొగుడుతూ ఒక ట్వీట్ వేశాడు. అందులో ఏముంది అనుకుంటున్నారా…? ఆ వరల్డ్ కప్ లో భారత్ ఓడిపోయింది. నాటకీయంగా తలపిస్తున్న ఆ ట్వీట్ కు ఊతం ఇచ్చేలా ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వస్తుంది. మొన్న వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత ధోని వెస్టిండీస్ సిరీస్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో అతను భారత సైనిక దళానికి తన సేవలు అందించేందుకు కశ్మీర్ కి వెళ్లాడు. ఈ మధ్యనే అక్కడి నుంచి కూడా సెలవు తీసుకున్న ధోని కుటుంబంతో కలిసి విహారాల్లో ఉన్నాడు. అయితే మొన్న దక్షిణాఫ్రికాతో భారత్ సొంత దేశంలో ఆడబోయే టి20 సిరీస్ కి ధోనిను ఎంపిక చేయకపోవడం గమనార్హం.

ఇలాంటి ఎన్నో విషయాలు ధోనీ రిటైర్మెంట్ వాదనలను బలపరుస్తున్నాయి. మరికొద్ది సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండబోతున్న తరుణంలో ఎం.ఎస్ ధోని శాశ్వతంగా తన అంతర్జాతీయ కెరీర్ కి ముగింపు చెప్పబోతున్నాడు అని దాదాపుగా ఖాయం చేసుకోవచ్చు. ఇప్పటికే ధోని అభిమానులు ఇలాంటి వార్త ఏదీ బయటికి రాకూడదని దేవుళ్ళకి మొక్కడం ప్రారంభించారు. సచిన్ తర్వాత భారతీయులు ఎంతో అభిమానించే క్రికెటర్ అయిన ధోని ఇప్పటివరకు ప్రపంచంలో ఏ కెప్టెన్ సాధించిన ఘనత సాధించాడు. ప్రతి ఒక్క ఐసీసీ ట్రోఫీని ఎవరికీ సాధ్యం కాని రీతిలో తన ఖాతాలో వేసుకున్న సారథిగా ధోని పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. 

దానితో పాటు అతను సాధించిన లెక్కలేనన్ని రికార్డులు నింపేందుకు మా పోర్టల్ కూడా సరిపోదు. ఇప్పుడే కాకపోయినా మరికొద్ది రోజుల్లోనే ధోనీ తప్పకుండా తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. కాబట్టి ఈ ఉహనాతీతమైన కెప్టెన్ తీసుకునే నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలి. విజయవంతంగా తన కెరీర్ ముగించబోతున్న సారధి... నీకు మా వందనాలు…. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్న 'మహి' కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.


మరింత సమాచారం తెలుసుకోండి: