వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీలో ప్రతీ రోజు ఏదొక కొత్త అంశం పై  రాజకీయ వర్గాల్లో రచ్చ లేస్తూనే ఉంది.  ఈ పరిణామాల మధ్యే  ఊహించని రీతిలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ పుంజుకుని తన ఉనికిని మరింత స్థిర పరుచుకునేందుకు సర్వత్రా ప్రయత్నాలు మొదలుపెట్టింది.  అయితే టీడీపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా..  జగన్ ప్రభుత్వం అణిచిపారేస్తోంది. ఈ క్రమంలోనే  టీడీపీలో ఆందోళన ఎక్కువ అవుతుందట.  బాబులో మునపటిలా శక్తి లేదు. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ  ఎటు పోతుందో ఎలా ఉంటుందో అన్నది తెలుగు తమ్ముళ్లకు పాలుపోవడం లేదట.  అందుకే తమ ఉనికిని ఎలా అయినా సరే కాపాడుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇటు చంద్రబాబు  కూడా తెలుగుదేశం పార్టీని ఎలా అయినా సరే నిలబెట్టాలని ఎప్పటి నుండో  డ్రామాలు   ఆడుతున్నారని... ఈ క్రమంలోనే  పైడ్ ఆర్టిస్టులను పెట్టి అడ్డంగా దొరికేశారని, అలాగే  తన పై కుట్ర చేస్తున్నారని డ్రోన్ డ్రామాలు పెట్టారనిఎం తనకు సెక్యూరిటీ తీసేశారని ఇలా ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా  హిట్ అవ్వలేదని  వైసీపీ వాళ్ళు  వెటకారంగా బాబు పై విరుచుకుపడుతున్నారు.   అదే విధంగా తనని మాత్రమే  కార్నర్ చేస్తున్నారు అన్నట్టుగా  ఆ మధ్య  బాబు అసెంబ్లీలో సింపతీ డ్రామా చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు, మొన్న  ఛలో ఆత్మకూరు అని ఏదో అలజడి రేపుదామని చూసారు,  కానీ అది కూడా..  విఫలం అయ్యింది..   అందుకే  మళ్ళీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు తన బుర్రకు పదును పెట్టి.. కొత్త డ్రామాతో ముందుకు వస్తారని, అందుకు సిద్ధంగా ఉండాలని  వైసీపీ సమావేశాల్లో చర్చ జరుగుతుందట.    


ఎందుకంటే  ప్ర‌త్య‌ర్ధి పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ పై పాలనలో జరుగుతున్న లోపల పై  బాబుకి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ విషయాలన్నిటినీ  ప్రజల్లోకి పూర్తిగా వెళ్లేలా బాబు ప్రయత్నం చేస్తారు.  ఎలాగూ తమ  బ‌లాల‌ను  తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా ప్రస్తుతం చర్చా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే  ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే  ఒక నాయకుడ్ని పెట్టారు.  మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికీ  పక్కా  ప్ర‌ణాళిక‌లు వేసుకుని బాబు ముందుకు పోతున్నాడు. ఈ లెక్కన  బాబు మళ్ళీ సీఎం అవ్వొచ్చు ఏమో.  అలా అవ్వాలంటే బాబు ఇంకా  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పైన పోరాటం చేయాలి.  ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ఉండాలి.  గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌కు, ఈ ప్ర‌భుత్వ పాల‌న‌కు తేడాను  నోట్ చేస్తూ అప్పుడ‌ప్పుడూ నాయ‌కుల‌తో అధినేత స‌మీక్ష‌లు జరపాలి. ఇవన్నీ బాబు ప్రస్తుతం చేస్తున్నారు. ఇంకా బాగా చెయ్యాలి.   అలాగే పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కులు  అసంతృప్తితో కొట్టుమిట్టాడుకుండా వారికీ భవిష్యత్తు పై భరోసా ఇవ్వాలి.  ఇవ్వన్నీ చేస్తే.. బాబు ఈజ్ బ్యాక్.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: