కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా, మరి కొంత మంది శాసనసభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అసంతృప్తి గళాలు వినిపించిన వారిని , అజ్ఞాతం లోకి వెళ్లిన వారిని పార్టీ నాయకత్వం రంగంలోకి దిగి బుజ్జగించింది . దీనితో  పరిస్థితి అంతా ఒక కొలిక్కి వస్తుంది అనుకొంటున్న తరుణం లో అధికార పార్టీకి చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ ,పార్టీ నాయకత్వానికి గట్టి ఝలక్ ఇచ్చారు.  


నిజామాబాద్ ఎంపీ అరవింద్ తో గురువారం మధ్యాహ్నం  షకీల్ భేటీ కావడం రాజకీయంగా కలకలం రేపింది . మంత్రివర్గం లో స్థానం ఆశించిన షకీల్ , మంత్రి పదవి దక్కకపోవడంతోనే అరవింద్ తో కలిసి, బీజేపీ లో చేరేందుకు  మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది . పార్టీ మారడం పై సూటిగా సమాధానం చెప్పకపోయినా , పార్టీ మారే అవకాశాలు లేకపోలేదని సంకేతాలను ఇవ్వడం ద్వారా టీఆరెస్ నాయకత్వానికి షాక్ ఇచ్చారు . షకీల్, అరవింద్ ను భేటీ అయిన తరువాత  టీఆరెస్ పార్టీ నాయకత్వం రంగం లోకి దిగి దిద్దుబాటు చర్యలను చేపట్టినట్లు తెలుస్తోంది .   అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బిజెపి నాయకత్వం పదేపదే చెబుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో షకీల్ ,  అరవింద్ తో భేటీ కావడం పరిశీలిస్తే నిజంగానే టీఆరెస్ ఎమ్మెల్యేలు , బిజెపి నాయకత్వం తో  టచ్ లో ఉన్నారేమోననే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక  షకీలా బిజెపిలో చేరడం దాదాపు ఖరారైనట్లేనన్న వాదనలు విన్పిస్తున్న తరుణం లో , షకీల్ ఒక్కరే పార్టీ మారనున్నారా? , ఆయనతో పాటు మరెవరైనా ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉందా? అన్నదానిపై టీఆరెస్ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది . షకీల్ పార్టీ మారితే, టీఆరెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని , ఇక టీఆరెస్ నుంచి బీజేపీ లోకి వలసలను ఆపడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . 



మరింత సమాచారం తెలుసుకోండి: