ఎలా అంటే ఆలా మాట్లాడితే ఎవరికైన శిక్ష తప్పదు. అక్కడ ఎవరు ఉన్న శిక్ష అనుభవించాల్సిందే. భారతీయులు అందరూ సమానులే అని ఇప్పుడిప్పుడే ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాంటి చోటా ఓ రాజకీయ నాయకురాలు నోరు జారింది. అంతే ఇంకేముంది కేసు నమోదయ్యింది. మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిపై తాజాగా మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. 


'చలో ఆత్మకూరు' అంటూ అనవసరంగా అది ఇది అని ఏదో సాధించాలి అని చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలను, కార్యకర్తలను రోడ్లపైకి తీసుకొచ్చాడు. అలానే చలో ఆత్మకూరు కార్యక్రమని నన్నపనేని రాజకుమారి కూడా పిలిచారు. దీంతో ఆమె కూడా ఈ చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలా వచ్చిన ఆమె అందరిల పలకపక్షాన్ని తిట్టి సైలెంట్ ఉండచ్చు కదా. 


లేదు నోరు పారేసుకుంది. మాములుగా కూడా కాదు.. అనవసరంగా దళితుల మనోభావాలు దెబ్బతినేలా దుర్భాషలు ఆడింది. అది కూడా ఓ దళిత మహిళా ఎస్సైని ఉద్దేశించి ’ఈ దళితులతోనే దరిద్రమంతా వచ్చింది’ అంటూ దూషించారు. విధి నిర్వహణలో ఉన్న ఓ దళిత ఎస్సైని రాజకుమారి దూషించటం ఆడియో, వీడియోల్లో స్పష్టంగా ఉంది. ఆ ఆడియోలు, వీడియోలు రోజుకు పది సార్లు వేసి పదే పదే చూపిస్తున్నాయి టీవీ చానళ్ళు. 


దీంతో మనస్ధాపానికి గురైన ఎస్సై అనురాధ 'నన్నపనేని రాజకుమారి'పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజకుమారిపై సెక్షన్ 353, 506,509 r/w 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. ఆమె ఏమైనా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడాలి కానీ కులాలు మతాలు అంటూ మాట్లాడకూడదు. ఆమె మాటలను బట్టి చూస్తేనే తెలుస్తుంది అధికారం కోసం తప్ప ప్రజలకోసం మాట్లాడలేదు అని. 


మరింత సమాచారం తెలుసుకోండి: