రాష్ట్ర మంతట అత్యంత వైభవంగా నిర్వహించుకునే వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు ప్రతిజిల్లాలో ప్రజలు శోభాయమానంగా జరుపుకుంటున్నారు.పది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి,నిమజ్ఞనం రోజు అందంగా అలంకరించిన వినాయక విగ్రహాలతో,లారీలు, ట్రాక్టర్లు, జీపులు,ఆటోరిక్షాలు ఎక్కడ చూడు మెరిసిపోతు కనిపిస్తున్నాయి.శోభాయాత్ర సందర్భంగా ‘జై బోలో గణేష్ మహరాజ్ కీ జై’,‘గణపతి బప్పా మోరియా’అంటూ పెద్దఎత్తున భక్తులు చేసే నినాదాలతో నగర వీధులన్నీ మార్మోగిపోతున్నాయి.ఈ సందర్భంగా పంచే గణపతి ప్రసాదం తినాలని ఎవరు అనుకోరు.ఎంతోరుచిగా అనిపించే పాయసం, పులిహోరా తినడానికి భక్తులు ఉత్సాహాన్ని చూపిస్తారు.కాని అప్పుడప్పుడు కొన్ని చోట్ల ప్రసాదాలు వికటించి ఫుడ్ పాయిజన్ అవుతాయి.



ఇలాంటి ప్రమాదాన్ని పసిగట్టడం కష్టం ఇక ఓ చోట ఇలాగే జరిగి చాల మంది అస్వస్దతకు గురయ్యారు..ఊరు ఊరంతా వినాయక నిమజ్జనోత్సవాల్లో మునిగి తేలుతున్న వేళ కొందరు ప్రసాదంగా పంచిన పులిహోర తిని అస్వస్థతకు గురయ్యారు.వీరిలో 10 మంది వరకు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లింగంపల్లి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది.తీవ్ర అస్వస్థతకు గురైన వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవాలకు సిద్ధం చేయించిన పులిహోరలో ఎవరైనా కుట్రతో విషప్రయోగం చేయించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



కాగా ఈ సమాచారం అందుకున్న అధికారులు,గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి మరి కొందరికి,వైద్య సేవలు అందిస్తున్నారు.ఇక ఈ ఘటనకు సంబంధంచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చిన్న పెద్దలంతా ఆనందంగా ఉన్నవేళ ఇలాంటి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం.మళ్లి గణపతి ఉత్సవాలకోసం సంవత్సరం పాటు ఎదురుచూడాలి కాబట్టి చివరి రోజైన నిమజ్ఞనాన్ని ఆటపాటలతో గడుపుదామని ఎదురుచూసే వారెందరో వుంటారు. ఇలాంటి సమయంలో ఇలా అనుకోని సంఘటనలు జరిగితే, ఆనందం ఆవిరై వారి కుటుంబంలో ఆందోళన మొదలవుతుంది కాబట్టి అందరు వీలైనంత తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: