ఆంధ్రరాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి పేర్కొన్నారు.  అనేక గ్రామాల్లోని తెలుగుదేశం వారిని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి అనేక గ్రామాల్లో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని భయభ్రాంతానికి గురిచేసి వారు ఊళ్ళల్లో ఉండకుండా చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కొందరు ఈ విషయాలపై వైసీపీ నాయకులు చెబుతున్న తీరు బాధ కలిగిస్తోంది. వెసీపీ నాయకులు వ్యవస్థను పూర్తిగా  చెరిచేస్తున్నారని పేర్కొన్నారు. 


ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటే వారిని కాపాడలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది.  శిబిరాల్లో ఉన్నది పెయిడ్‌ ఆర్టిస్టులని హోంమంత్రిగారు చెప్పారు. సమాజాన్ని వేరు చేయాలన్నదే వారి భావన. రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ధోరణిలో వారు పోతున్నారు. ఇది ప్రజలు కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీవారిపైన ఏ కేసులు లేకపోయినా పాత కేసులున్నవారిపక్కన అదర్స్‌ అని రాసి పెట్టుకున్నారు. ఆ అదర్స్‌ అనేచోట ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతోందన్నారు. 


ఆరు, ఏడు రోజుల క్రితం ఏ కేసు లేని వ్యక్తిపైన ప్రస్తుతం అప్పటి ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేయడం జరుగుతోంది. బెయిల్‌ వచ్చిన తరువాత మళ్లీ సెకండ్‌ కేసు చూపించారు. ఏ-3గా మళ్లీ కేసు నమోదు చేశారు. ఈ విధంగా ఆరు కేసుల్లో పేరు యాడ్‌ చేశారు. 8 కేసులు పూర్తయిన తరువాత ఈ రోజు పీడి యాక్టు నమోదు చేయడం జరిగింది. సంవత్సరం రోజులు బెయిల్‌ రాకూడదని చూస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇటువంటి దౌర్జన్యాలు జరగడంలేదు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోందని దీపక్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతానికి గురి చేయాలన్నదే వారి ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడరు. మీ అరాచకాలపు లొంగేది లేదని గట్టిగా చెప్తున్నానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: