వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. గత ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు.  ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి.  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా నిర్ణయాలు తీసుకుంటూ దూసుపోతున్నాడు.  వంద రోజుల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు.  4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.  అదే విధంగా నీరు, ఇల్లు, పోలవరం విషయం,   ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.  


అంతేకాదు, తక్కువ జీతాలతో ఇప్పటి వరకు ఇబ్బందులు పడుతున్న ఆశా వర్కర్లకు జీతాలు పెంచారు.  అలానే పింఛన్ పెంచారు.  ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు.  కాగా, నేటితో జగన్ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది.  కొత్త ప్రభుత్వానికి 100 రోజుల గడువు ఇవ్వాలని, వంద రోజుల్లో ఆ పార్టీ పనితీరును బట్టి ప్రజల్లోకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పారు. 


చెప్పినట్టుగా జగన్ వందరోజుల పాలన విషయంలో ఓ చార్ట్ తయారు చేయించారు.  దానిపై ఇప్పటికే సమీక్షించారు.  ఈనెల 14 వ తేదీన పవన్ ఆ విషయాలను వెల్లడించబోతున్నారు.  ప్రభుత్వం 100 రోజుల పాలన ఎలా ఉన్నది.  దీనిపై ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి.  ఎలా పవన్ తన కార్యాచరణను మొదలుపెట్టబోతున్నారు.  ఒకవేళ పనితీరు బాగుంది ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా లేదంటే.. పవన్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.  


ప్రభుత్వ పనితీరును దగ్గరగా గమనించిన వ్యక్తులచేత రిపోర్ట్ తయారు చేయించినట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ వందరోజుల చార్ట్ ను బయటపెట్టిన తరువాత ప్రజల్లోకి వెళ్లి జనసేన పార్టీని బలోపేతం చేయబోతున్నారని, వచ్చే లోకల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని, తద్వారా కొన్ని సీట్లు గెలుచుకొని పార్టీని బలోపేతం చేయబోతున్నారని వినికిడి.  మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో చూడాలి.  పవన్ పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాడు.  పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది సెప్టెంబర్ 14 వ తేదీతో తేలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: