ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ వణికిపోతోంది. కేంద్రం కూడా తన అంచనాలు సవరించుకుంటోంది. మాంద్యం బారి నుంచి దేశాన్ని కాపాడటానికి కొత్త దారులు వెదుకుతున్నారు. మరోవక్క ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ మాంద్యం దెబ్బకు బేషజాలు వదిలేశాడు.


తాజా తానే బడ్జెట్ ప్రవేశపెడుతూ దాదాపు 30 వేల కోట్ల రూపాయల కోత వేసేశాడు. అసలు ఇలాంటి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సివస్తుందని తానే ఎప్పుడూ అనుకోలేదని బీద మాటలు మాట్లాడారు. అంటే పరిస్థితి ఎంత డేంజర్ గా ఉందో అర్థమవుతోంది. కానీ సీన్ ఇలా ఉంటే.. ఏపీ సీఎం జగన్ మాత్రం కాస్త కూల్ గానే కనిపిస్తున్నారు.


అంతే కాదు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఆటో, టాక్సీ వాలాలకు ఎన్నికల ముందు ఇచ్చిన ఆర్థిక భరోసా హామీని పట్టాలెక్కించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.


వచ్చే నెల 4వ తేదీ నుంచి ఆటో, ట్యాక్సీవాలాలకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఫైనాన్స్‌తో వాహనాలు తీసుకున్న వారికీ పథకం వర్తిస్తుందని తెలిపారు.


అయితే లబ్దిదారుల ఖాతాల్లో ఈ పది వేల రూపాయలు జమ చేస్తే.. ఆ సొమ్మును బకాయి ఉన్న బ్యాంకులు తమ అప్పు కింద జమ చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే.. లబ్దిదారులు కొత్త ఖాతాలు తీసుకోవాలని మంత్రి సలహా ఇస్తున్నారు. అంతే కాదు.. వచ్చే ఏడాది నుంచి టూ వీలర్ టాక్సీ వాలాలకు కూడా ఆర్థిక సాయం అందించే ఆలోచన కూడా ఉందని మంత్రి అంటున్నారు. మాంద్యం సంగతి ఎలా ఉన్నా.. ఇచ్చిన మాట తప్పకూడదనే జగన్ భావిస్తున్నట్టు ఈ చర్యతో తెలిసిపోవడం లేదూ.


మరింత సమాచారం తెలుసుకోండి: