టీఆర్‌ఎస్‌ పార్టీలో గురువారం జరిగిన ఓ పరిణామం కలకలం సృష్టించింది. టీఆర్ఎస్ కు చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్... బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్‌తో భేటీ కావడం కలకలం సృష్టించింది. అంతే కాదు.. ఆయన ఆ తర్వాత ఓ మీడియాతో మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి.


కేసీఆర్ దయతోనే ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన గుర్తు చేసుకుంటూనే పార్టీ కోసం కష్టపడినవారికి గుర్తింపు లేదని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో ఉండలేకపోతున్నానని చెప్పారు. రాజీనామా చేయడానికి కూడ తాను సిద్దంగా ఉన్నానని తేల్చి చెప్పారు.


టీఆర్ఎస్ లో తాను ఏకైక ముస్లిం ఎమ్మెల్యేగా ఆయన గుర్తు చేసుకున్న షకీల్.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని కేసీఆర్ హమీ ఇచ్చారన్నారు .. తమ పార్టీ నేతలు ఎంఐఎం నేతలు చెప్పినట్టుగా వింటున్నారని కూడా షకీల్ కామెంట్ చేశారు. ఆయన కామెంట్లు చూసి షకీల్ కూడా బీజేపీలోకి వెళ్తున్నారా అన్న అనుమానాలు వచ్చాయి.


అయితే రాత్రి కల్లా షకీల్ మాట మారినట్టు తెలుస్తోంది. ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేసినట్టు ఓ సందేశం మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అందులో షకీల్ వాదన ఇలా ఉంది.

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే షకీల్ ఖండించారు. సీఎం కేసీఆర్ నాకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చారని ఎమ్మెల్యే షకీల్ గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు ఎమ్మెల్యే షకీల్. సీఎం కేసీఆర్ నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్ అంటున్న షకీల్.. నేను ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను వీడేది లేదని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: