చంద్రబాబునాయుడు చేస్తున్న చేష్టలు చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది అందరికీ. అధికారం కోల్పోయి పట్టుమని మూడు నెలలు అయ్యిందంతే. ఇంతదానికే నానా యాగీ చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై. జనాలందరూ రివర్సు ఎన్నికలు కోరుకుంటున్నట్లు చెప్పారు.

 

అంటే తన మనసులో మాటనే చంద్రబాబు జనాల మాటగా చెప్పేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి చంద్రబాబులో అశాంతి రోజురోజుకు పెరిగిపోతోంది. దాన్ని చల్లార్చుకోవటానికి నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న గోలకు ఎల్లోమీడియా సంపూర్ణ మద్దతు పలుకుతోంది.

 

 నిజానికి చంద్రబాబు బలమే మీడియా మద్దతు. మొసలికి నీళ్ళల్లో ఎంతటి బలం ఉంటుందో చంద్రబాబుకు మీడియా బలం అలాంటిది. అలాంటి మీడియా మద్దతును కూడా జగన్ బద్దలు కొట్టి టిడిపిని చావు దెబ్బ కొట్టారు. అంటే జరగని పనులను జరిగినట్లు, అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరిగిపోతున్నట్లు, పోలవరం లాంటి ప్రాజెక్టులు శరవేగంతో జరిగిపోతున్నట్లు ఐదేళ్ళు జనాలను ఎంతగా భ్రమల్లో ముంచాయో అందరికీ తెలిసిందే.

 

తాము చెప్పినదాన్ని జనాలు నమ్మారని చంద్రబాబు, ఎల్లోమీడియానే భ్రమపడింది. అందుకనే ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది.  చంద్రబాబుకు వ్యతిరేకంగా జనాల్లో   ఇంతటి వ్యతిరేకత ఉందని ఎల్లోమీడియా ఏమాత్రం ఊహించలేదు. అందుకనే ఎన్నికలు ముగిసినప్పటి నుండి చంద్రబాబు, ఎల్లోమీడియా కలిసే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.

 

గడచిన మూడు నెలల్లో జగన్ కు వ్యతిరేకంగా పనికట్టుకుని చేస్తున్న ప్రచారమంతా ఇందులో భాగమే. గుంటూరులో వైసిపి బాధితుల శిబిరం పేరుతో చంద్రబాబు చేస్తున్న హడావుడిలో  టిడిపి నేతలకన్నా ఎల్లోమీడియా చేస్తున్న ప్రచారమే ఎక్కువగా ఉంటోంది. శిబిరానికి తమంతట తామే రావాల్సిన నేతల్లో చాలామంది అసలు అటువైపు తొంగి కూడా చూడలేదు.

 

అందుకనే నేతలను శిబిరానికి రమ్మంటూ ట్రస్ట్ భవన్ నుండి ఫోన్లు చేసి పిలిపించాల్సొస్తోందని పార్టీ నేతలే అంటున్నారు. నేతల నుండి పెద్దగా సహకారం అందని నేపధ్యంలో  ఎల్లోమీడియా మద్దతే లేకపోతే చంద్రబాబు పరిస్ధితి ఎలాగుండేదో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: