రోదసిలో నిర్మాణాలు కట్టడం అంటే మాములు విషయం కాదు.  గురుత్వాకర్షణ శక్తి ఉండదు.  రోదసీలోకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ నిలబడటం కష్టంగా ఉంటుంది.  అలాంటి చోట ఇళ్ల నిర్మాణం జరగాలి అంటే చాలా కష్టమైన విషయం.  అయితే, టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో.. భవిష్యత్తులో చంద్రుని వంటి గ్రహాలమీద ఇల్లు నిర్మించాలంటే సాధ్యం అవుతుందా లేదా అని దాని చుట్టూ ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి.  ఇందులో భాగంగానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సిమెంటు కంకర వంటి వాటితో ప్రయోగాలు చేయడం మొదలయింది.  


సిమెంటు తయారీలో మూలకంగా ఉపయోగించే ట్రైకాల్షియం సిలికేట్ ను నీటిలో కలిపి చూశారు.  నీటితో కలిపినపుడు బంధం దృఢంగా లేకపోయినా.. కొంతవరకు బలంగానే ఉన్నది.  వీటిమధ్యలో గాలిబుడగలు వంటివి ఉండటంతో కొంత వరకు ప్రయోగం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.  దీనిపై మరిన్ని ప్రయోగాలు చేసి రోదసిలో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అనుగుణంగా ఉండే విధంగా సిమెంట్ వంటి వాటిని తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు శాస్త్రవేత్తలు.  


2022 నాటికి చంద్రునిపై నిర్మాణాలు ప్రారంభించాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.  దానికోసం నాసా, యూరోపియన్స్ స్పేస్ రీసెర్చ్, రష్యా స్పేస్ రీసెర్చ్ లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేస్తున్నాయి.  చంద్రునిపై ఇంటి నిర్మాణం సక్సెస్ అయితే.. దానిని అనుసరించి మరిన్ని నిర్మాణాలు చేపట్టవచ్చు అన్నది శాస్త్రవేత్తల ఆలోచన.  ఇండియా కూడా ఈ దిశగానే ఆలోచనలు మొదలుపెట్టింది.  2022 లో ఇస్రో చేపట్టబోయే గగన్ యాన్ యాత్ర తరువాత, చంద్రునిపై తమ స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్నీ చూస్తున్నది ఇండియా.  


ఒక్క చంద్రుని మీదనే కాకుండా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరహాలోనే ఇండియా మరో రెండేళ్లలో ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతున్నన్నది. ఆ అంతరిక్ష కేంద్రం ఓ మజిలీగా వినియోగించుకుంటూ.. ప్రయోగాలను చేయాలని చూస్తున్నది ఇండియా.  స్పేస్ రీసెర్చ్ విభాగంలో ఇండియా ఇప్పటికే టాప్ దేశాల సరసన నిలిచింది.  ఇండియా చేపడుతున్న మొదటి ప్రయోగంతోనే సక్సెస్ అవుతున్నది.  చంద్రయాన్ 2 సైతం 95శాతం సక్సెస్ అయ్యింది అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఒకవేళ భవిష్యత్తులో చంద్రునిపై ఇళ్ల నిర్మాణం సాధ్యమైతే.. చాలావరకు ప్రజలు అక్కడికి తరలించే అవకాశం ఉంటుంది.  కొత్తగ్రహంపై కొత్త జీవితం ఎలా ఉంటుందో మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: