జులై 22 వ తేదీన మార్క్ 3 ద్వారా చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని ఇండియా రోదసీలోకి పంపించింది.  ఆ తరువాత వరసగా అన్ని దశలను పూర్తి చేసుకున్న చంద్రయాన్ 2 ఆఖరి నిమిషంలో జరిగిన పరిణామాల కారణంగా ల్యాండర్ విక్రమ్ నుంచి సిగ్నల్స్ బ్రేక్ అయ్యాయి.  దీంతో ల్యాండర్ కూలిపోయిందని అనుకున్నారు.  కానీ, ల్యాండర్ విక్రమ్ కూలిపోలేదని, ఒక పక్కకు మాత్రమే ఒరిగిందని ఆర్బిటర్ నుంచి సమాచారం అందింది.  విక్రమ్ తో అనుసంధానం అయ్యేందుకు ఇస్రో ప్రయత్నాలు మమ్మురం చేసింది.  


నిన్నటి వరకు ఇస్రో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది.  ఈ విషయంలో ఇప్పుడు నాసా సహకారం కూడా తీసుకున్నది.  నాసా కు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ, డీప్ స్పేస్ నెట్ వర్క్ లోని భూకేంద్రాల నుంచి చంద్రునిపై ఉన్న ల్యాండర్ కు రేడియో తరంగాలను పంపింది.  విక్రమ్ ల్యాండర్ నుంచి వచ్చే సిగ్నల్స్ కోసం ఇవి ఎదురు చూస్తున్నాయి.  దీంతోపాటు దక్షిణ క్యాలిఫోర్నియాలో ఉన్న గోల్డ్ స్టోన్, స్పెయిన్ లో ఉన్న మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్బెర్రా లో ఉన్న కేంద్రాల నుంచి 12 కిలోవాట్ల రేడియో తరంగాలను విక్రమ్ కు చేరవేస్తున్నారు.  ల్యాండర్ నుంచి వచ్చే సంకేతాల కోసం ఎదురు చూస్తున్నారు.  


నాసాకు చెందిన ఈ కేంద్రాలు చాలా శక్తివంతమైన కేంద్రాలు అని చెప్పొచ్చు.  ఎందుకంటే.. విశ్వంలోని ఏ మూల వరకైనా రేడియో తరంగాలను పంపగలిగే శక్తి వీటికి ఉన్నది.  ఎక్కడినుంచైనా వచ్చే సంకేతాలను ఇవి రిసీవ్ చేసుకోగలవు.  అందుకే ఇస్రో నాసా సహాయం కోరింది.  దీంతో ఇస్రోకు సహాయం చేసేందుకు నాసా ముందుకు వచ్చింది.  ఈనెల 20-21 వ తేదీలతో ల్యాండర్ సమయం ముగుస్తుంది.  ఆ తరువాత అక్కడ సూర్యశక్తి ఉండదు.  14 రోజులపాటు విపరీతమైన చలి ఉంటుంది.  


దాదాపు మైనస్ 248 డిగ్రీల సెల్సియస్ చలి ఉంటుంది.  ఆ సమయంలో ల్యాండర్, రోవర్ లు పనిచేయడం కుదరదు.  ఇంకా 9 రోజుల గడుపు మాత్రమే ఉండటంతో ఇస్రో, నాసాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  ల్యాండర్ నుంచి సిగ్నల్స్ వస్తే.. దాన్ని పునరుద్ధరించడం పెద్ద కష్టం ఏమి కాదు.  ఓ రెండుమూడు రోజులు పాటు రోవర్ కిందకు దిగి పనిచేసినా.. కొంత వరకు ఫలితాలు వస్తాయి.  అందుకే విశ్వప్రయత్నం చేస్తున్నది.   ల్యాండర్ హార్ట్ గా దిగినా.. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా తయారు చేసి ఉంటె ఈపాటికి పరిశోధనలో చాలా ముందుకు వెళ్ళేవాళ్ళాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: