అధికారం చేతి నుంచి జారిపోగానే కొందరు టీడీపీ నేతలు గుండెలు కూడా జారిపోతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు అడ్డగోలుగా వ్యవహరించిన నాయకులు ఇప్పుడు ఏది మాకు దిక్కని ఆందోళనలో మునిగుతున్నాయి. పాపం.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అదే పరిస్థితి ఎదురవుతోంది. సాధారణంగా మీడియా ముందు నీతులు వల్లించే సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇప్పుడు పోలీసుల భయానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.


మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోర్జరీ డాక్యుమెంట్ల కేసులో ఇరుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారన్నది అభియోగం. బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రైవేట్‌ కేసు దాఖలు చేశారు. కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సోమిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చింది.


విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు మాజీ మంత్రిసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావల్సి ఉంది. విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు.


కానీ హైకోర్టులో ఆయనకు సానుకూల ఫలితం రాలేదు. విచారణ చేయాల్సిందేనని కోర్టు చెప్పడంతో ఆయన అజ్ఞాతంలోకి జారుకున్నట్టు తెలుస్తోంది. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు పోలీసులు నోటీసులు ఇవ్వదలచుకున్నారు. హైదరాబాద్ ఉన్న ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా సోమిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి చెందిన అనేక మంది నేతలు ఇలా కేసుల్లో ఇరుక్కుని అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. మరి మీడియా ముందు గట్టిగా మాట్లాడే సోమిరెడ్డి కూడా కేసులు ఎదుర్కోకుండా ఇలా చేయడం ఏంటో..?


మరింత సమాచారం తెలుసుకోండి: