ఆర్టికల్ 370 రద్దు దాయాది దేశాల మధ్య దూరం పెంచింది.  రెండు దేశాల మధ్య వైరం పెంచింది.  రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను దూరం దూరం చేసింది.  అన్ని విషయాల్లో పాక్ ఇండియాతో తెగతెంపులు చేసుకుంది.  అంతర్జాతీయ వేదికలపై ఇండియాపై అక్కసు వెళ్లగక్కుతోంది.  చైనా సహకారంతో ఎన్ని కుట్రలు చేస్తున్నా.. ప్రపంచ దేశాలు మాత్రం పాక్ చెప్తున్న వాటిని నమ్మడం లేదు.  ఎందుకంటే ఆ దేశంలోనే ఉగ్రవాదులు ఉన్నారు.  వారి సహాయంతోనే పాక్ ఇండియాలో టెర్రర్ సృష్టించాలని చూస్తున్నది.  


ఇండియా మాత్రం పాక్ ఎత్తుగడలను తిప్పికొడుతూనే.. అంతర్జాతీయంగా మద్దతు సాధిస్తూ వస్తున్నది.  ఇదిలా ఉంటె, న్యూఢిల్లీ వేదికగా షాంగై సహకార వ్యవస్థ సమావేశాలు జరుగుతున్నాయి.  ఈ సమావేశాలకు సభ్యులుగా ఉన్న అన్ని దేశాలు హాజరయ్యాయి.  కానీ, పాక్ మాత్రం మొదటిరోజు సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో పాక్ పై చైనా కోపంగా ఉండటంతో.. రెండో రోజు సమావేశాలకు పాక్ తన ఇద్దరు ప్రతినిధులను పంపించింది.  ఈ ఇద్దరు ప్రతినిధులు షాంగై సహకార వ్యవస్థ సమావేశాల్లో పాల్గొన్నది.  


ఇదిలా ఉంటె,  జమ్మూ కాశ్మీర్ విషయాన్ని పాకిస్తాన్ పక్కన పెట్టాలని, పాక్ లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై దృష్టి పెట్టాలని హితవు పలికింది ఇండియా.  దీంతో పాటు పాక్ తన అభివృద్ధిని చూసుకోవాలని, ఇండియా విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే హెచ్చరించింది.  అంతేకాదు, పీవోకే విషయంలో ఇండియా ఇప్పటికే స్థిరమైన నిర్ణయం తీసుకుంది.  తమ నెక్స్ట్ అజెండా పీవోకే సాధనే అని ఇప్పటీకే స్పష్టం చేసింది.  


పాక్ రక్షణ, హోమ్ శాఖ మంత్రితో కేంద్ర మంత్రులు, నాయకులు కూడా పీవోకే సాధనే అజెండా అని చెప్పడంతో పాక్ కు నిద్రపట్టడంలేదు. ఇండియాను ఉగ్రవాద కార్యకలాపాలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్న ఎత్తుకు పారడం లేదు.  పైగా పాక్ లో ఉగ్రవాద నిర్మూలన కోసం అమెరికా తమ సైన్యాన్ని పాక్ లో ఉంచింది.  మెల్లిగా అక్కడి నుంచి పాక్ సైనికులు తిరిగి అమెరికా వెళ్లిపోతున్నారు.  అటు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉన్న అమెరికా సైన్యం వెనక్కి వెళ్ళిపోతున్నది.  నిన్న ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సైన్యం సిద్ధంగా ఉందని, కేంద్రం అనుమతి ఇస్తే.. క్షణాల్లో పీవోకేను సొంతం చేసుకుంటామని చెప్పింది.  దీంతో పాక్ మరింత బెదిరిపోయింది.  ఒకవేళ ఇండియా పీవోకే విషయంలో అడుగు ముందుకు వేస్తె చైనా పాక్ కు సహకరిస్తోందా అంటే.. సహకరించకపోవచ్చని నిపుణులు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: