Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 5:11 am IST

Menu &Sections

Search

ఇస్రో సిబ్బంది జీతాల కథలు మీకు తెలుసా?

ఇస్రో సిబ్బంది జీతాల కథలు మీకు తెలుసా?
ఇస్రో సిబ్బంది జీతాల కథలు మీకు తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుని ఉపరితలం మీద ప్రయోగాలు నిర్వహించడానికి పంపిన చంద్రయాన్ 2 చంద్రుని మీద దిగే కొద్ది క్షణాల్లో కమ్యూనికేషన్ కట్ అవడం అందరినీ నిరాశ పరిచింది. అహర్నిశలు శ్రమించి, సెలవులు కూడా పెట్టకుండా ఆ ప్రయోగం మీదే పని చేసిన శాస్త్రవేత్తలకి చంద్రయాన్ 2  కనెక్షన్ కట్ అవడం కోలుకోలేని దెబ్బ. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి 28 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంకా 2.1 కిలోమీటర్ల దూరంలో ఉందనగా విక్రమ్ ల్యాండర్ ఆచూకీ మిస్సయింది.


చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేద్దామనుకుని తమ లక్ష్యాల్ని చేరలేకపోయినందుకు ఇస్రో ఛైర్మన్ కె శివన్ దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశాడు. ప్రధాని మోదీ సహా దేశ ప్రజానీకం అంతా శాస్త్రవేత్తలకి అండగా నిలిచారు. రోదసిలో 3,84,400 కిలోమీటర్ల వరకు విక్రమ్ ల్యాండర్ ను తీసుకెళ్లడం  సాధారణ విషయం కాదని, అది కూడా ఒక విజయమేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సైతం మన ఇస్రో సిబ్బందిని ప్రశంసించారు. మరి అంతటి ప్రతిభాపాటవాలు ఉన్న మన శాస్త్రవేత్తల జీత భత్యాల విషయంలో కేంద్రం వ్యవహరించే తీరు శాస్త్రవేతలని ఇబ్బంది పెడుతుంది.


ఇందులో పనిచేసే సిబ్బందికి ఏడాదికి 1.5 లక్షల నుండి 6.12 లక్షల రూపాయల వరకు మాత్రమే వేతనాలను చెల్లిస్తుంది. డ్రాయింగ్ లను విశ్లేషించి మ్యాప్ లను రూపొందించే సివిల్ ఇంజనీర్లకు ఏడాదికి 2.20 లక్షల నుమ్డి 6.12 లక్షల రూపాయల వరకు చెల్లిస్తుంది. టెక్నికల్ అసిస్టెంట్ కు ఏడాదికి 2.36 లక్షల నుండి 6 లక్షల వరకు వస్తున్నాయి. ఎక్కువ పని ఉండే ఫిట్టర్ కు ఏడాదికి 1.53 లక్షల నుండి 4.5 లక్షల వరకు వస్తున్నాయి. ఐఐటీల్లో చదువుకుని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు 9 లక్షల నుండి 12 లక్షల వరకు వస్తుంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇస్రోలో పని చేసే వారికి మాత్రం ఈ రేంజ్ లో వేతనాలు చెల్లించడం ఆశ్చర్యంగా ఉంది.


అదీ గాక ఇస్రోలో ప్రతీ ఏటా సిబ్బందికి పదివేల రూపాయలు బోనస్ గా ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం 1996 నుండి అమల్లో ఉంది. సిబ్బందిని ప్రోత్సహించేందుకే ఇలా బోనస్ ఇస్తున్నారు. జులై ఒకటవ తేదిన కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఇక ముందు ఎలాంటి బోనస్ ఉండదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. జులై 15 వ తేదీన చంద్రయాన్ ప్రయోగం జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్క్యులర్ రావడంతో దాని ప్రభావం సిబ్బంది మనసులపై  పడి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.


1996 నుండి వస్తున్న దాన్ని హఠాత్తుగా ఆపివేయడంతో సిబ్బంది షాక్ తిన్నారు. దేశ భక్తి గురించి అనుక్షణం ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం దేశం కోసం పనిచేసే ఇస్రో సిబ్బంది పట్ల వ్యవహరించిన తీరు బాగాలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం అద్భుతాలు ఆశిస్తే సరిపోదు. అందుకు సరిపడా సౌకర్యాలు కూడా కల్పించాలి అనే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అంటున్నారు.


Do you know about salaries of ISRO staff
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3: ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు
విజిల్ సినిమా వారికే అంకితం....దర్శకుడు అట్లీ
సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి వస్తున్న దీపావళి గిఫ్ట్ అదే...
బిగ్ బాస్ 3: టైటిల్ రేసులో ఆ ఇద్దరు...వెనకబడ్డ శ్రీముఖి, రాహుల్
కంచరపాలెం సినిమా దర్శకుడి తర్వాతి సినిమా అదేనా?
తమన్నా తప్పుకోవడం వల్లే "రాజు గారి గది 3" కథ మారిందా?
సరి లేరు నీకెవ్వరు సినిమాకి ఆ ఒక్క ఎపిసోడ్ చాలట
రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి ప్రదర్శన...అదొక్కటి లేకపోతే...
బిగ్ బాస్ 3: బాబా భాస్కర్ పై విరుచుకుపడటానికి ఆలీకి సాయం చేసింది ఎవరు?
బిగ్ బాస్ 3: ఆలీ చేసిన తప్పిదం...షాక్ లో ప్రేక్షకులు
నెగెటివ్ రివ్యూలు రాసిన వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కమెడియన్ ఆలీ
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆలస్యం కావడానికి కారణం అదే.......
"అల వైకుంఠపురములో" కోసం అంత పని చేశాడా?
వెంకీ మామా ఆలస్యం కావడానికి కారణం ఏంటి?
రష్మిక మరో అవకాశం కూడా చేజార్చుకుందా?
మహేష్ పొగడ్తలతో సంబరపడిపోతున్న అభిమానులు
సూర్య తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందో చెప్పేసిన కార్తి
మన హీరోయిన్ మళ్ళీ వచ్చేస్తోంది
బిగ్ బాస్ 3 : శ్రీముఖి నిజంగానే రాహుల్ ని రికమెండ్ చేశానని చెప్పిందా?
వెళ్తూ వెళ్తూ రాహుల్ కి ఊహించని షాక్ ఇచ్చిన వితికా
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రవిబాబు
నాలుగవ సినిమా పూర్తి కాకముందే ఐదవ సినిమా మొదలేట్టేశాడా?
రాయల్ ఆల్బర్ట్ హాల్ లో పంచె కట్టులో మెరిసిన రాజమౌళి
బిగ్ బాస్ 3: నాగార్జున కూడా సాల్వ్ చేయలేకపోయిన విషయాలు
బిగ్ బాస్ 3: గెస్ట్ గా వచ్చిన నోయల్ శ్రీముఖిని పరోక్షంగా టార్గెట్ చేశాడా?
బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ వన్ విన్నర్
టీడీపీని బీజేపీలో విలీనం చేయాలి.....ఇంతకంటే ఘోరం ఉంటుందా?
జగన్ నిర్ణయాలు వైయస్ ఆర్ ఆశయాలకు అనుగుణంగా లేవా?
"సామజవరగమనా" పాటకి అంత ఖర్చు చేశారా....?
ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న బిగిల్
కల్కి భగవాన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా...?
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఆరోజున సరికాదంటున్న పాత్రికేయులు
బిగ్ బాస్ 3: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ 3: నాగార్జున అడగాల్సిన ప్రశ్నలు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.