మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇండియాను ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారు.  తానూ ప్రసంగించే ప్రతి సభలోను ప్లాస్టిక్ రహిత భారతం గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు.  ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే నష్ఠాలను వివరిస్తున్నారు.  ప్లాస్టిక్ ను ఎక్కువగా వినియోగించడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుందని హెచ్చరించారు.  ప్రతి ఒక్కరు పర్యావరణ సహితం కోసం పోరాటం చేయాలని హితవు పలికారు.  దాని కోసమే పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మోడీ.  


మోడీ ఇచ్చిన పిలుపుకు సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు.  నిన్న బాలీవుడ్ సినిమా కూలీ నెంబర్ 1 యూనిట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్టు ప్రకటించింది.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదిస్తున్నట్టు ప్రకటించింది.  దీంతో మోడీ కూలీ నెంబర్ 1 సినిమా యూనిట్ ను ప్రశంసించింది.  కాగా, ఇప్పుడు ఢిల్లీలోని హోటల్స్   యాజమాన్యం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిస్తున్నట్టు ప్రకటించింది.  హోటల్స్ లో ప్లాస్టిక్స్ బాటిల్స్ ప్లేస్ లో గాజు బాటిల్స్ ను  వినియోగించాలని నిర్ణయించారు.  


అంతేకాదు, ప్లాస్టిక్ ప్లేట్స్  స్థానంలో స్టీల్ లేదా  పేపర్ ప్లేట్స్ వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.  అంతేకాదు ప్లాస్టిక్ స్ట్రాలను కూడా పక్కన పెట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.  వీటి స్థానంలో వెదురుతో తయారు చేసిన వాటిని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదంలో భాగంగా తమ వంతుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు హోటల్ యాజమాన్యం ప్రకటించింది.  


దేశంలోని సెలెబ్రిటీలు, సామాజిక సేవా సంస్థలు ఈ విషయంలో ముందు ఉండి  ప్రజలను మోటివేట్ చేస్తే ఇది చాలా వరకు సాధ్యం అవుతుంది.  లేదంటే... ఈ పధకం అమలు జరగడానికి చాలా సమయం పడుతుంది.  ప్రధాని ఈ  బాధ్యతను  భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు.  భారతీయులుగా ప్రతి ఒక్కరు ఈ నిర్ణయాన్ని స్వాగతించి తమవంతుగా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు జరిగేవిధంగా చూస్తే తప్పకుండా ఇండియా ప్లాస్టిక్ రహిత భారతదేశంగా మారుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: