తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న ఇన్ ఫ్లోతో జలాశయం జలకళను సంతరించుకుంది. సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగుల వరకు ప్రాజెక్ట్ లో నీరు ఉంది. సాగర్ డ్యామ్ నిండు కుండలా మారడంతో 20  గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ పర్యాటకులతో కళకలాడుతోంది.


కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదిలో వరద పెరిగింది. దీంతో ఆనకట్టలను దాటుకుంటూ కృష్ణమ్మ సముద్రం వైపు పరుగులు పెడుతుంది. జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులన్నీ పూర్తి నీటి నిల్వ సామర్థానికి చేరుకోవడంతో.. గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ 2O గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు నాగార్జున సాగర్‌కు పర్యాటకులు క్యూ కట్టారు. సాగర్ పై నుంచి డ్యామ్ అందాలను చూసి మురిసిపోతున్నారు. మొబైల్‌ ఫోన్ లతో  సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 


నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి క్రష్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ పులిచింతల ప్రాజెక్టు వైపుకు పరుగులు తీస్తోంది. 10 ఏళ్ళ తర్వాత నెల రోజుల వ్యవధిలోనే సాగర్ గేట్లను రెండోసారి ఎత్తారు అధికారులు. ఆగస్టు 12న మొదటిసారి సాగర్‌కు ఉన్న 26 గేట్లు ఓపెన్ చేశారు. వారం రోజులకు గేట్లు మూసివేశారు. ఆ తర్వాత మళ్ళీ శ్రీశైలం నుంచి భారీగా సాగర్‌కు ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 9వ తేదీ రాత్రి 8 గేట్లు ఎత్తేశారు. ప్రస్తుతం 20 గేట్లను ఎత్తారు అధికారులు. మొత్తంగా మరోసారి నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చెయ్యడంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. మొత్తంగా మరోసారి సాగర్ గేట్లు ఓపెన్ చెయ్యడంతో డ్యామ్ దగ్గర పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: