ఇటీవలి కాలంలో బ్యానర్ల సంస్కృతి బాగా పెరిగిపోయింది.పండగలొచ్చిన,పెళ్లిలైన,ఏ చిన్న ఫంక్షన్స్ ఐనా,చివరకు రాజకీయ పార్టీలతోపాటు ఏ కార్యక్రమం జరిగినా జనాలకు బ్యానర్లు కట్టడం అలవాటుగా మారింది.కాని ఈ అలవాటు అప్పుడప్పుడు ప్రమాదంగామారి ప్రాణాలు తీస్తున్నాయి.ఈ ప్రమాదంలో అభంశుభం తెలియని అమాయకులు బలి అవుతున్నారు.భవిష్యత్తు పై ఎన్నోఆశలు పెట్టుకుని జీవిస్తున్న వారి జీవితాల్లోకి తెలియకుండానే మృత్యువు తొంగి చూస్తుంది.తాజాగా,ఇలాంటి ఘటనే తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది.వివరాలు ఏంటో తెలుసుకుంటే ..



దక్షిణ చెన్నైలో ఓ అధికార పార్టీకి చెందిన బ్యానర్ మీద పడటంతో సుభశ్రీ(22) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది.స్కూటీపై ఇంటికి వెళుతున్నసుభశ్రీపై అధికార పార్టీ  బ్యానర్ ఒక్కసారిగా పడటంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడింది. అయితే, అప్పుడే వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు సుభశ్రీ పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఇక యువతి మృతి విషయం తెలిసిన విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.



హోర్డింగ్ పెట్టుకోవడానికి అనుమతి కూడా తీసుకోలేదని ధ్వజమెత్తాయి.ఇక ఈ సంఘటనపై డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ స్పందిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల అసమర్థత కారణంగా ఇంకెన్ని ప్రాణాలు పోవాలని.అనవసరంగా ఓ అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిసాయని ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జరిగిందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు.నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ దుర్మార్గపు పాలనలో మరెన్ని ప్రాణాలు పోవాలని ప్రశ్నించారు.ఈ సంఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం అన్నాడీఎంకే బ్యానర్ ఒక్కసారిగా ఆ యువతిపై పడటంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై పడింది.అయితే,అప్పుడే వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ ఆమెపై నుంచి దూసుకెళ్లిందని తెలిపారు.ఇక మరణించిన మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: